పెట్రోల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పటికే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. సంపాదనలో సంగం దానికే అయిపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక త్వరలో ప్రజలకు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. అదే జరిగితే సామాన్యుడిపై బడ్జెట్ భారం పెరుగుతుంది. ప్రజలపై GST భారం పెరగనుంది. త్వరలో జరగబోయే సమావేశంలో జీఎస్‌టీ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 5 శాతంగా ఉన్న శ్లాబ్ రేట్‌ను 8 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జీఎస్‌టీ శ్లాబ్స్ 5 శాతం నుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే. బేస్ శ్లాబ్ రేట్‌ను 8 శాతానికి పెంచే ఆలోచనలో జీఎస్‌టీ కౌన్సిల్ ఉన్నట్టు తెలుస్తోంది. శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో వంట నూనెలు, మసాలాలు, టీ, కాఫీ, చక్కెర, స్వీట్స్, కాజు, ఫర్టిలైజర్స్, క్యాబ్ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, టూర్ ఆపరేటర్ సేవల్లాంటివి ఉన్నాయి.
జీఎస్‌టీ కౌన్సిల్ 5 శాతం శ్లాబ్‌ను 8 శాతానికి మారిస్తే ఇకపై వీటన్నింటిపై 8 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వీటి ధరలు 3 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రేట్లు పెరిగితే మాత్రం సామాన్యులపై చాలా భారం పడనుంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.