మనిషి తలుచుకుంటే అతని ఎదుగుదలను ఏ శక్తి ఆపలేదు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో, అంతేకానీ ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు. మహాకవి శ్రీ శ్రీ చెప్పిన మాటలు ఇవి. వీటినే ప్రేరణగా తీసుకున్న ఓ నిరుద్యోగి.. తనకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితిలను ఎదిరించాడు. తనతలరాతని తానే మార్చుకున్నాడు. నిన్న మొన్నటి వరకు చేతిలో ఒక్క రూపాయి కూడా అవస్థ పడ్డ ఆ నిరుద్యోగి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఎంతో మంది యువతలో స్ఫూర్తి కలిగించే ఆ నిరుద్యోగి ఎవరు? అతను సాధించిన విజయం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కరీంనగర్ ముకరంపురలోని దంగర్వాది స్కూల్ సమీపంలో నగరానికి చెందిన ఆర్. నరసింహ అనే యువకుడు డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ఐఐటీ కూడా పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అన్నది అతని కల. నోటిఫికేషన్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాడు. అయినా.. ప్రయోజనం లేకుండా పోయింది. తన మిత్రులు అంతా జీవితంలో సెటిల్ అయిపోతూ ఉంటే, తాను ఒక్కడినే ఇలా మిగిలిపోవడం నరసింహకి నచ్చలేదు. దీంతో.., ఎలా అయినా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. చివరికి నరసింహా తెలంగాణ నిరుద్యోగ మిర్చి బండి పేరుతో మిర్చి బజ్జీ వ్యాపారం మొదలు పెట్టాడు.
ప్రారంభంలో అంతగా లాభాలు రాలేదు. కానీ.., ఓపిక పట్టాడు. మనలో ఒకడు ఇలా మిర్చి బండి పెట్టుకుని కష్టపడుతున్నాడని యువకులు అంతా అతని బండి దగ్గరికి రావడం మొదలు పెట్టారు. టేస్ట్ అద్భుతంగా ఉండటంతో తరువాత అందరూ నరసింహ బండి దగ్గరికి క్యూ కట్టారు. కట్ చేస్తే నరసింహ ఇప్పుడు సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్సన్ అయ్యాడు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బండి నడిపిస్తాడు. నెలకి లక్ష రూపాయల వరకు మిగిలించుకుంటున్నాడు. ఇక్కడ ఇంకా షాకింగ్ ట్విస్ట్ ఏమిటో తెలుసా? తన బండి దగ్గర హెల్పర్స్ గా పని చేసేవారు కూడా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులే. తనకి సహాయం చేస్తున్న ఆ కుర్రాళ్ళకి నరసింహ రోజుకి 300 నుండి 400 రూపాయలు ఇస్తున్నాడు. చూశారు కదా? ఇదీ ఓ నిరుద్యోగి సక్సెస్ జర్నీ. మరి.. నరసింహ కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
