దేశంలో చట్టం ఎవరికైనా ఒక్కటే. కానీ.., కొందరు మాత్రం తమ వారు పదవుల్లోనో, పవర్ లోనో ఉంటే ఓవరాక్షన్ చేస్తుంటారు. వారి అధికారాన్ని అడ్డుపెట్టుకోని ఇష్టం మెచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ కానిస్టేబుల్ హెల్మెంట్ లేదని బైక్ పై వెళ్తున్న ఓ అధికారి కొడుకును ఆపినందుకు ఆ కుర్రాడు వీరంగం చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి:
నన్ను ఒంటరిగా వదిలేశారు! నటి సుధ ఎమోషనల్ కామెంట్స్!
కరీంనగర్ పట్టణంలో కొందరు యువకులు వేగంగా బైక్ పై వెళ్తు వీరంగం సృష్టించారు. పోలీస్ అని స్టికర్ ఉన్న బండిపై వెళ్తున్న ఈ యువకులను కలెక్టరేట్ సమీపంలో కానిస్టేబులు ఆపాడు. వారిని హెల్మెంట్ పెట్టుకోవాలని సూచించాడు. వారిలోని ఓ యువకుడు.. సీఐ కొడుకునే ఆపుతావా అంటూ నడిరోడ్డుపై కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగక కానిస్టేబుల్ పై దాడి చేసేందుకు యత్నించాడు. నాకే రూల్స్ చెబుతావా అంటూ ఓ రేంజ్ లో హల్ చల్ చేశాడు. కానిస్టేబుల్ ను అసభ్యంగా తిడుతూ అక్కడ రచ్చ చేశాడు.
స్థానికులు ఆపేందుకు ప్రయత్నించిన ఆగలేదు సదరు యువకుడు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ యువకుడి అదుపులోకి తీసుకున్నారు. యువకుడి పోలీస్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తే తెలిసింది.. ఆ మహానుభావుడు ఎవరో కాదు ఓ సీఐ పుత్రరత్నం అని. ఈ వ్యవహారం ఇప్పుడు కరీంనగర్ లో చర్చనీయాంశంగా మారింది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.