రాజకీయాల్లో ఎప్పుడు, ఏమి జరుగుతుందో.. చెప్పలేము. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాలను అంచనా వేయడం విశ్లేషకులకు సైతం అంతు పట్టదు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలే నెలకొన్నాయి. 151 సీట్లతో అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నేతల నుండి ఎలాంటి సమస్యలు లేవు. కానీ.., ఈ మధ్య కాలంలో ఆయనకి కుటుంబ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఒకవైపు చెల్లలు షర్మిల పార్టీకి పూర్తిగా దూరం అయిపోయింది. ఇప్పుడు జగన్ తల్లిగారు విజయమ్మ కూడా వైసీపీకి దూరం కాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వైఎస్సార్ వర్థంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మీటింగ్ కి గతంలో వైఎస్సార్ తో కలిసి పని చేసిన నేతలు, ఆయన సన్నిహితులు, అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు అందరికీ ఆహ్వానం పంపారు విజయమ్మ. వీరిలో ఎవరెవరు ఆ మీటింగ్ కి హాజరు అవుతారో తెలియదు గాని.., జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ మీటింగ్ కి దూరంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. విజయమ్మ నుండి కూడా జగన్ కి ఆహ్వానం అందలేదన్న వార్త బలంగా వినిపిస్తోంది.
ఈ మీటింగ్ వల్ల మైలేజ్ అంతా కూడా తెలంగాణలో షర్మిల పార్టీకి ఉపయోగపడేలా చేయాలన్నదే విజయమ్మ ఆలోచనగా తెలుస్తోంది. అంతే కాకుండా.. ఈ మీటింగ్ లోనే గాని, దీని తరువాత గాని విజయమ్మ వైసీపీకి రాజీనామా చేసి.., వైఎస్ఆర్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొడుకు ఎలాగో పొలిటికల్ గా కింగ్ మేకర్ అయ్యాడు కాబట్టి, తల్లిగా ఇప్పుడు తన సహాయం అంతా కూతురికి అందించాలి అన్నదే విజయమ్మ ఆలోచనగా తెలుస్తోంది. అయితే.., ఈ వార్తలు అన్నీ పొలిటికల్ ఫీల్డ్ లో వినిపిస్తున్న ఊహాగానాలు మాత్రమే. మరి.., వీటిలో ఏవి నిజం అవుతాయి, ఏవి పొలిటికల్ గాచిప్స్ గా మిగిలిపోతాయి తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.