ఫిల్మ్ డెస్క్- జబర్ధస్త్.. ఈ బుల్లితెర కామెడీ షో ఎంత పాపులరో అందరికి తెలిసిందే. అప్పటి వరకు ఎవరికి తెలియని నటీ నటులెందరో ఈ జబర్దస్త్ షో ద్వార సెలబ్రెటీలు అయ్యారు. ఎలా ఎంతో మందికి జీవితాన్ని, మంచి గుర్తింపునిచ్చిన జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యూయేల్ జోడీకి ప్రత్యేకత ఉంది. సుడిగాలి సుధీర్, రష్మి జంటకు ఎంత పాపులారిటీ ఉందో, వర్ష-ఇమాన్యూయేల్ జోడికి కూడా ఆ స్థాయిలో క్రేజ్ ఉంది.
మరి వాళ్లిద్దరి మధ్య ఎంతమేర లవ్ ట్రాక్ ఉందో తెలియదు కానీ, జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యూయేల్ చేసే స్కిట్స్ మాత్రం వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే అర్ధం వచ్చేలా కనిపిస్తాయి. అదంతా పక్కనపెడితే వర్ష, ఇమాన్యూయేల్ కారులో షికారు చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేక్ చేస్తుండగా. అవును మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా జబర్ధస్త్ జడ్జ్ రోజానే బయటపెట్టింది.
వర్ష, ఇమాన్యూయేల్ కలిసి కారులో షికార్లు కొడుతుండగా తీసిన ఓ ఫోటో చూపిస్తూ వాళ్లిద్దరిని నిలదీశారు రోజా. ఐతే వర్ష, ఇమాన్యూయేల్ ట్రాఫిక్ పోలీసులకు దొరికింది నిజంగా కాదు. ఇదంతా జరిగింది జబర్దస్త్ స్కిట్ లోనే. కానీ ఈ స్కిట్ బజర్ధస్త్ సెట్ లో కాకుండా, హైదరాబాద్ రోడ్లపై షూట్ చేశారు. అవును న్యూ ఇయర్ సందర్బంగా వర్ష, ఇమాన్యూయేల్ ప్రత్యేక స్కిట్ చేశారు. అందులో భాగంగా వీళ్లిద్దరు కారులో వెళ్తూ డ్రంక్ అండ్ ట్రైవ్ తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు.
జబర్ధస్త్ నటుడు నూకరాజు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పోలీస్ గెటప్స్ వేసి అర్ధరాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుంటారు. ఈ క్రమంలో కారులో వర్ష, ఇమ్మాన్యుయేల్ షికారు చేస్తూ వాళ్లకు దొరికారు. లైసెన్స్ ఏదని పోలీసులు అడగడంతో, ప్రేమించుకోవడానికి లైసెన్స్ కూడా కావాలా అని అమాయకంగా ప్రశ్నిస్తుంది వర్ష.
న్యూ ఇయర్ సందర్భంగా పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు అనే స్పెషల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ స్కిట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ఈవెంట్ ప్రసారం చేయబోతున్నారు.