ఫిల్మ్ డెస్క్- మూగ జీవాలు అంటే జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూగ జీవాలను రష్మి ఎంతో ప్రేమిస్తుందని అందరికి తెలిసందే. మూగ జీవాలపట్ల ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తే, వాళ్లు ఎంతటి వాళ్లైనా చడా మడా తిట్టెస్తుంది రష్మీ గౌతమ్.
మూగ జీవాల విషయంలో రష్మీ సమాజాన్ని కూడా నిలదీస్తుంది. సంక్రాంతి కోడి పందెలా, బక్రీద్ నాడు చేసే జీవహింస.. ఇలా ప్రతీ దాన్నిరష్మీ వ్యతిరేకిస్తూ, తన అభిప్రాయాలని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ వస్తోంది. అందులోను వీధి కుక్కలను గాయపరిచే ఘటనలపై చాలా సందర్బాల్లో ఆగ్రహాం వ్యక్తం చేసింది రష్మీ.
తాజాగా రష్మీ గౌతమ్ ఓ దారుణమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వార పోస్ట్ చేసింది. పందులను ఎలా చంపి ఆహారంగా మార్చుతున్నారో చెప్పింది. బతికి ఉన్న పందులను పట్టుకుని సుత్తితో కొడుతున్న దృశ్యాలను చూపించింది రష్మీ. ఆ పోస్ట్ ను రష్మీ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. అంతే కాదు ఆ ఘటనపై రష్మీ చాలా ఎమోషనల్ అయింది.
తాను బతకాలని ఆశపడ్డ ఓ పందిని బలవంతంగా లాగారు.. అది బతికి ఉండగానే దాని తల మీద సుత్తితో కొట్టి చంపారు.. ఇలా ప్రతీ సారి జరుగుతూనే ఉంటుంది.. ఇదంతా నిత్య ప్రక్రియలా కొనసాగుతూనే ఉంటుంది.. మన రుచుల కోసం అవి ఈ బాధను అనుభవిస్తున్నాయి.. కానీ అది సరైన పద్దతేనా.. ఈ మూల్యం సరైనదేనా.. అంటూ ప్రశ్నించింది రష్మీ గౌతమ్.
అన్నట్లు రష్మీ గౌతమ్ ప్రస్తుతం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో అందరినీ అలరించేందుకు సిద్దమైంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక యదావిధిగా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్, డ్యాన్స్ షోలతో చాలా బిజీగా ఉంది రష్మీ.