ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా శనివారం(ఏప్రిల్ 23)న సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచులో కోహ్లీ మరోసారి డకౌట్ అయ్యాడు. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ మొదటి ఓవర్ లో వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఈక్రమంలో రెండో ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న మార్కో జాన్సెన్.. రెండో బంతికి డుప్లెసిస్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేశాక.. తర్వాతి బంతికే కోహ్లీని డక్ అవుట్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీకి ఇది వరుసగా రెండో గోల్డెన్ డక్ కావడం గమనార్హం.
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన గత మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఇదే పద్దతిలో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చిన పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఆఫ్‌సైడ్ బంతిని ఆడేందుకు ప్రయత్నించి స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్ చివరి బంతికి యువ ఓపెనర్ అనూజ్ రావత్ (0)ను కూడా జాన్సెన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో బెంగళూరు జట్టు 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కోల్పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
Not only RCB fans, but every cricket fan also can’t see Virat Kohli struggling like this💔
📸: Disney+Hotstar#IPL2022 | @imVkohli | #RCBvSRH pic.twitter.com/2Xg3gx1Cdq
— CricTracker (@Cricketracker) April 23, 2022