ఈ రోజుల్లో మూడు ముళ్ల బంధం కంటే అక్రమ సంబంధానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు కొందరు. కట్టుకున్న పెళ్లానికి కోక కొనలేని వాడు.. ప్రియురాలి కోసం మాత్రం తాజ్ మహల్ కట్టేస్తుంటాడు. అలాంటి చీకటి బంధాలతో వారి జీవితాలనే కాదు వారి కుటుంబాలను సైతం నాశనం చేస్తున్నారు. 5 నిమిషాల సుఖం కోసం కన్న పిల్లల్ని కూడా కడతేరుస్తున్నారు. అలాంటి ఒక దుర్మార్గము తండ్రి, అతని ప్రియురాలికి ఉరిశిక్ష వేసి కోర్టు చక్కని సందేశాన్ని ఇచ్చింది. ఇదంతా జరిగింది మన దేశంలో కాదులెండి.. చైనాలోని చాంగ్ కింగ్ మున్సిపాలిటీలో.
అక్కడి మీడియా కథనాల ప్రకారం.. ప్రియురాలి కోసం జాంగ్ బో(25) తన ఇద్దరు పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా 15వ అంతస్తు నుంచి తోసేసి హత్య చేశాడు. మొదటి భార్యకు పుట్టిన పిల్లల్ని తాను పెంచను అని అతని ప్రియురాలు అనడంతో ఆ నిర్ణయం తీసుకున్నాడీ ప్రబుద్ధుడు. జాంగ్ బోకు మొదటి భార్య చెన్ మెయిలిన్ కు విడాలుకు ఇచ్చాడు. అతను తర్వాత ప్రియురాలు చెంగ్ షెన్ తో వివాహానికి సిద్ధమైపోయాడు. కానీ, అందుకు ఆమె ఒక షరతు పెట్టింది. ‘నీ మొదటి భార్య పిల్లల్ని వదిలించుకో నేను వాళ్లను పెంచను. అలా అయితేనే మన వివాహం జరుగుతుంది’ అంటూ చెంగ్ షెన్ షరతు పెట్టింది.
ఓ రోజు వీడియో కాల్ చేసి చేతి మణికట్టు కోసుకోవడంతో 15వ అంతస్తు నుంచి తన పిల్లలు జాంగ్ రిషు(2), జాంగ్ యాంగ్రుయ్(ఏడాది వయసు)లను పడేశాడు. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. ఇంకొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తాను ఆ సమయంలో నిద్రపోతున్నట్లు అందరినీ నమ్మించాడు. తన మొదటి భార్య వ్యాఖ్యలతో పోలీసులకు అసలు అనుమానం మొదలైంది. తనతో ఉండగానే చెంగ్ షెన్ ను వివాహం చేసుకున్నట్లు, ఆమె కోసమే విడాకులు కూడా తీసుకున్నట్లు మొదటి భార్య తెలిపింది. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. కోర్టు వారిద్దరికీ మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పు సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.