సాధారణంగా సమాజంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి రకరకాల ఉద్యోగాలు సృష్టిస్తుంటాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తుంటాయి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను చూస్తే మనకు దిమ్మతిరిగిపోతుంది. ఏంట్రా బాబు ఈ నోటిఫికేషన్ అనుకుంటాం. ఇక మరికొన్ని ఉద్యోగాల కోసం వేసే నోటిఫికేషన్లను, వాటి జీతాలను చూస్తే.. మనం నోరెళ్ల బెట్టటం ఖాయం. తాజాగా అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే ఓ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ఎలుకలను పట్టుకోవడం. మీకు మరీ సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఇది నిజంగా నిజమైన నోటిఫికేషన్. దానికి జీతం ఎంతో తెలుసా సంవత్సరానికి అక్షరాలా 1.38 కోట్లు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
మీకు ఎలుకలు పట్టుకునే నైపుణ్యం ఉందా? కనికరం లేకుండా ఎలుకలపై పోరాడగలరా? అయితే మీ డ్రీమ్ జాబ్ రెడీగా ఉంది రండి! అంటూ జాబ్ ఆఫర్ చేస్తున్న ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ నిరుద్యోగులకు ఓ బంపర్ జాబ్ ఆఫర్ ను ఇచ్చాడు. న్యూయార్క్ నగరంలో నెలకొన్న ప్రధాన సమస్య ఎలుకలు విపరీతంగా ఉండటం. ఈ సమస్య నుంచి విముక్తి కలిగించడం కోసం ఏకంగా ఓ కొత్త పోస్ట్ నే సృష్టించాడు నగర మేయర్ ఆడమ్స్. ఎలుకలు అంటే తనకు అసహ్యమని, అదీకాక నగరంలో ఒక్క ఎలుక కూడా ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇక ఈ ఉద్యోగానికి భారీగా జీతం ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఏడాదికి రూ. 1.38 కోట్ల జీతాన్ని ఇస్తామని, ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నాడు.
ఇక ఈ ఉద్యోగాన్ని డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్ అని పిలుస్తారని మేయర్ ఆఫీస్ ప్రకటించింది. ఈ ఉద్యోగంలో చేరే వారికి దీర్ఘదృష్టి, నాయకత్వ లక్షణాలు కూడా ఉండాలని సూచిందింది. తమ నగరాన్ని ఎలుకలు లేని పట్టణంగా తీర్చిదిద్దటమే తమ ధ్యేయంగా ప్రకటించింది. ఇలా చేస్తే.. రోడ్లు పరిశుభ్రంగా ఉండటంతో పాటుగా నగర వాసులు అనారోగ్యం బారిన పడరని మేయర్ ఆడమ్స్ తెలిపాడు. ఈ ఉద్యోగం పట్ల ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ఈ నోటిఫికేషన్ చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎలుకలు పట్టడం ఒక జాబ్ ఏంటి? పైగా 1.38 కోట్లు జీతం ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
There’s NOTHING I hate more than rats.
If you have the drive, determination, and killer instinct needed to fight New York City’s relentless rat population — then your dream job awaits.
Read more: https://t.co/ybNxcJeJP7
— Mayor Eric Adams (@NYCMayor) December 1, 2022