అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవారికోసం బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ – వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ఈ ఆఫర్ ప్రకటించారు. చరిత్రాత్మక రోదసీయాత్ర విజయవంతంగా ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం. యాత్రలో సీటు దక్కించుకోవాలంటే 450,000(సుమారు రూ.33,382,682) డాలర్లు చెల్లించుకోవాలి.
బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ ఇందుకు మూడు ప్యాకేజీలను కూడా ప్రకటించింది. సింగిల్ సీట్, మల్టీ-సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బై అవుట్ ఆఫర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద టికెట్లు అందబాటులో ఉంటాయి. 2022లో రెవెన్యూ విమానాలను ప్రారంభించే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు స్పేస్-టూరిజం కంపెనీ తెలిపింది. అయితే ఇంతధరపెట్టి టికెట్ కొనడం అనేది సామాన్యులకు అసాధ్యమనే చెప్పొచ్చు. అది ఊహలకు కూడా అందదు.
జూలై 11న, జూలై 20న ‘న్యూ షెపర్డ్’ రాకెట్‌లో రోదసి యాత్ర జరిగిన సంగతి తెలిసిందే. ప్రజలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు యుఎస్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నుండి ఈ ఏడాది జూన్‌లో వర్జిన్ గెలాక్టిక్ ఆమోదం పొందారు.