195 దేశాలున్న మానవ ప్రపంచంలో ఎన్నో దేశాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ జాబితాలో మన భారత దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. పోనీ, ఇంకో 50 ఏళ్లకో.. 100 ఏళ్లకో అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందా? అంటే అదీ చెప్పలేం. కానీ, ఇక్కడ సంపన్నులకు మాత్రం కొదవలేదు. వారి తెలివితేటలతో వ్యాపార రంగంలో అందివచ్చిన అవకాశాలతో అపర కుబేరులుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకా అంటారా?.. అయితే ఇది చదవాల్సిందే. ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతం అదానీ రెండోస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆయన సంపద ఎంతన్నది తెలుసుకుందాం..
ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎవరంటే.. మొన్నటిదాకా.. జెఫ్ బెజోస్.. ఎలోన్ మస్క్ అనే పేర్లే వినపడేవి. సంపన్నుల దేశంగా పేరొందిన అమెరికాలో ఇవి కామన్ కదా అని మనమూ పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ, ఇప్పుడు ఈ జాబితాలోకి ఒక భారతీయుడు చేరారు. అమెజాన్ బాస్.. జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టి అదానీ రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఎలోన్ మస్క్ మొదటి ప్లేస్ లో ఉండగా, అదానీ, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్.. వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
#GautamAdani is $1 billion away from beating #JeffBezos as the second richest person in the worldhttps://t.co/IHJ52xsBKr
By @jainrounak pic.twitter.com/hl7dFoCYCf
— Business Insider India🇮🇳 (@BiIndia) September 16, 2022
గౌతమ్ అదానీ ఆస్తి..
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ ఆస్తి విలువ 147 బిలియన్ డాలర్లు. అమెజాన్ వ్యవస్థాపకుడు, CEO జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ కూడా 147 బిలియన్ డాలర్లు. అదే సమయంలో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న టెస్లా బాస్.. ఎలోన్ మస్క్ ఆస్తుల విలువ 264 బిలియన్ డాలర్లు. ఈ విలువలు రోజువారిగా మారుతుంటాయి. గమనించగలరు.