తమిళనాడులోని సేలంలోని అమ్మాపేట మార్కెట్ వీధిలో ప్రభుదేవా అలియాస్ ప్రభు (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరా క్రితం షాలినీ (22) అనే యువతితో ప్రభు వివాహం జరిగింది. తనకంటే వయసులో చాలా సంవత్సరాల పెద్దవాడైన ప్రభును పెళ్లి చేసుకోవడం షాలినీకి ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు బలవంతం చెయ్యడంతో పెళ్లి చేసుకున్న షాలినీ ఆమె భర్త ప్రభుతో కాపురం చేస్తోంది. భర్త ప్రభుతో ఆమె భార్య షాలినీ ఇష్టం ఉండిలేనట్లు కాపురం చేస్తోంది. వీరికి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్న పాప ఉంది.
పెళ్లి చేసుకునే సమయంలో పెద్దల మాట జవదాటని షాలిని పెళ్లయిన తరువాత మాత్రం భర్తకు దూరంగా ఉంటూ వచ్చేది. అయితే భర్త ప్రభు మాత్రం షాలినిని ప్రేమగా చూసుకునేవాడు. షాలిని అడిగిన ప్రతి ఒక్కటి తెచ్చేవాడు. కానీ షాలిని మాత్రం భర్త ప్రేమను పొందలేకపోయింది. అంతకుముందు ఉన్న భాయ్ ప్రెండ్ తోనే సంబంధాలు కొనసాగించేది ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది. ఏకంగా 50 మందితో ఒకరికి తెలియకుండా మరొకరితో చాటింగ్ చేసేది. రోజూ వారితో టచ్ లో ఉండేసరికి కొందరు ప్రేమలో మునిగిపోయారు. ఇంకొందరు ఒకడుగు ముందుకేసీ షాలినితో శారీరక సంబంధాలు కొనసాగించారు.
సెల్వరాజ్ అనే వ్యక్తితో తన ఇంట్లో ఉన్న సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా షాలిని దొరికిపోయింది. భర్త షాలినిని గట్టిగా హెచ్చరించాడు. అయినా షాలిని భర్త మాట వినకుండా అక్రమ సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. బెడ్ రూమ్ లో తాను పక్కన ఉన్నా పట్టించుకోకుండా తన భార్య షాలినీ ఎందుకు మొబైల్ ఫోన్ చూస్తోందని ప్రభు ఆరా తీశాడు. నిత్యం తన భార్య షాలినీ మొబైల్ ఫోన్ లో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తోందని గుర్తించిన భర్త ప్రభు ఆమె దగ్గర ఉన్న ష్మార్ట్ ఫోన్ లాగేసుకున్నాడు.
తన భర్త బతికుంటే ప్రియుడు తో ఎంజాయ్ చెయ్యలేనని భార్య తెలుసుకుంది. ప్రభు నిద్రపోతున్న సమయంలో షాలినీ ఆమె ప్రియుడు సెల్వరాజ్ కలిసి ప్రభును కత్తులతో పొడిచి చంపేసి గంట తరువాత పోలీసులకు, 108 అంబులెన్స్ కు ఫోన్ చేసింది. అన్నికోణాల్లో దర్యాప్తు చేసి కేసును కొలిక్కి తెచ్చారు. చివరికి షాలిని భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది.
