తెలుగు బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ షో ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభమై చాలా సంవత్సరాలే అయినప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ లను నేటికీ సొంతం చేసుకుంటోంది. గురు, శుక్రవారాల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పదుల సంఖ్యలో కమెడియన్లు పరిచయమయ్యారు. తమదైన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వారం వారం సరికొత్త కామెడీ స్కిట్ల తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో బుల్లెట్ భాస్కర్ ఖుబ్బుతో కలసి అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రోమోలో.. గెటప్ శ్రీను కనిపించాడు అందరి ఆశ్చర్యానికి గురిచేస్తాడు. రాంప్రసాద్ స్కిట్ చేస్తుండగా శ్రీను వెనుక నుంచి వచ్చి రాం ప్రసాద్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. శ్రీను సీనియర్ నటి అన్నపూర్ణంతో కలిసి మంచి నవ్వుల పువ్వులు పూయించాడు. రోహిణీ కూడా బుల్లెట్ బాస్కర్ వాళ్ల నాన్నతో కలిసి అదిరిపోయే కామెడీ పండించింది. ఈ క్రమంలో “రాను.. రానుంటూనే చిన్నదో” అనే పాటకు బుల్లెట్ భాస్కర్ తో కలిసి ఖుబ్బు డ్యాన్స్ చేశారు. వెంటనే మేడమ్ మనిద్దరు ఢీ షోకి కూడా వెళ్తామా అని, దీంతో అదే ఢీకి లాస్ట్ ఎపిసోడ్ అవుతుందంటూ భాస్కర్ అంటాడు.
దీంతో అక్కడే ఉన్న ఖుబ్బు ఒక్కసారిగా నవ్వుతుంది. జులై 29న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో తాజాగా విడుదలైంది. మరి.. భాస్కర్, ఖుబ్బుల ఫుల్ డ్యాన్స్ కోసం ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగక తప్పదు. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: జబర్దస్త్ షోలోకి గెటప్ శ్రీను రీ ఎంట్రీ.. నెక్స్ట్ సుధీర్ కూడా వస్తాడా?
ఇదీ చదవండి: Surya: ఓ సినిమా కోసం సూర్య ఇంత కష్టపడతాడా? హేట్సాఫ్ సూర్య!