ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే, మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. సినిమాల్లో తన సహజ నటన, డ్యాన్స్ తో అలరించడమే కాదు, టీవీ షోలోను అదరగెట్టేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన హోస్టింగ్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో, సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలతో సందడిగా సాగుతోంది. ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్ 1కు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడో పూర్తయ్యింది.
ఐతే ఎపిసోడ్స్ వైడ్స్‌గా టీవీలో టెలిక్యాస్ట్ అవుతున్నాయి. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షోలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు షో నిర్వాహకులు ఓ ప్రకటన కూడా చేశారు. ఐతే మహేష్ బాబుకు సంబందించిన ఎపిసోడ్ ను వెంటనే ప్రసారం చేయకుండా నిర్వాహకులు సరైన టైమ్ లో ప్రసాతం చేయాలని వెయిట్ చేస్తూ వచ్చారు.
ఇప్పటికే దానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. అందుకు సంబందించిన పూర్తి ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం కానుంది, మహేశ్ బాబును ఎన్టీఆర్ ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, దానికి మహేష్ ఎలాంటి సమాధానాలు చెప్పాడు.. ఇలా అనే విషయాలను తెలుసుకునేందుకు ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అటు మహేష్ బాబు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్, మహేశ్ బాబు కాంబినేషన్ లో రూపొందిన ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్‌ను డిసెంబర్ 5న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేయాలని షో నిర్వాహకులు డిసైడ్ చేశారని తెలుస్తోంది. ఇంకేముంది మహేశ్ బాబుకు సంబందించిన ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ తమ ఫ్రోగ్రామ్ కు అత్యధిక రేటింగ్ తెస్తుందని ఎవరు మీలో కోటీశ్వరులు షో నిర్వాహకులు భావిస్తున్నారు.