సాధారణంగా దంపతుల మధ్య విబేధాలు తలెత్తితే విడాకులు తీసుకుంటారు. విడాకులు మంజూరు చేసే సమయంలో కోర్టు.. భర్త ఆర్థిక పరిస్థితిని బట్టి.. భార్యకు భరణం చెల్లించాల్సిందిగా ఆదేశిస్తుంది. కోర్టు సూచించినంత మొత్తం చెల్లించలేనని తెలిపితే.. కొనేళ్ల పాటు జైల శిక్ష విధిస్తుంది. విడాకులు విషయంలో ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ ఇజ్రాయేల్ లో మాత్రం విడాకులు ఇవ్వాలంటేనే అక్కడి జనాలు గజ్జున వణికిపోతారు. ఎందుకంటే.. ఇక్కడ భరణం చెల్లించలేకపోతే.. కోర్టు మరో దారుణమైన శిక్ష విధిస్తుంది.
అందేంటంటే.. ఇజ్రాయేల్ మహిళకు విడాకులు ఇవ్వాలని భావించిన వ్యక్తి.. భరణం చెల్లించలేనని చెప్తే.. సదరు వ్యక్తి 8,000 ఏళ్ల పాటు దేశం విడిచి వెళ్ల కూడదు. అన్ని వేల సంవత్సరాలు ఎవరు బతకరని అందరికి తెలుసు. దీని ఉద్దేశం ఏంటంటే సదరు వ్యక్తి మరణించే వరకు దేశం విడిచి వెళ్లకూడదని భావం. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురవ్వడంతో ఈ వింత లా గురించి ప్రపంచానికి తెలిసింది. ఆ వివరాలు…
ఇది కూడా చదవండి : భార్య అతిశుభ్రత పాటిస్తుందని భర్త సంచలన నిర్ణయం!
ఆస్ట్రేలియాకు చెందిన నోమ్ హుప్పెర్ట్ అనే వ్యక్తి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో అనలిటికల్ కెమిస్ట్ గా పనిచేశాడు. కొన్నేళ్ల క్రితం హుప్పర్ట్ ఇజ్రాయేల్ కు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో 2012లో సదరు మహిళ పిల్లలను తీసుకుని సొంత దేశం ఇజ్రాయేల్‌కు వెళ్లింది. వారు వెళ్లిన కొన్ని రోజుల తర్వాత హుప్పర్ట్ కూడా ఇజ్రాయేల్ వెళ్లాడు. 2013లో హుప్పర్ట్ దంపతులు విడాకులు తీసుకున్నారు.
విడాకులు సందర్భంగా కోర్టు.. 3 మిలియన్ డాలర్ల మొత్తాన్ని (మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 22,61,85,000)భార్య, బిడ్డల సంరక్షణ కోసం భరణంగా చెల్లించాలని హుప్పర్ట్ ని ఆదేశిచింది. తాను అంత మొత్తం చెల్లించలేనని చెప్పడంతో కోర్టు స్టే ఆఫ్ ఎగ్జిట్ అనే ఆర్డర్‌ని పాస్ చేసింది. దీని ప్రకారం హుప్పర్ట్ 8,000 సంవత్సరాలు అనగా డిసెంబర్ 31, 9999 వరకు ఇజ్రాయేల్ దేశం విడిచి బయటకు వెళ్లకూడదు.
ఇది కూడా చదవండి : ‘పో’ అనే ఒక మాటతో విడిపోయిన భార్యాభర్తలు!
కోర్టు ఆదేశాల మేరకు 2013 నుంచి హుప్పర్ట్ ఇజ్రాయేల్ లోనే ఉండిపోయాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అతడు దేశం విడిచే వెళ్లే అవకాశం లేదు. హుప్పర్ట్ గురించి తెలిసుకున్న కొందరు జర్నలిస్ట్ లు, మానవ హక్కులు సంఘాలు ఈ వింత లాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇలాంటి వింత రాక్షస చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బ్రిటిష్ జర్నలిస్ట్ “మరియాన్నే అజిజి” అనే మహిళ ఇటీవల నోయం హూపర్ట్ గురించి తెలుసుకుని ఆస్ట్రేలియా మీడియాకు తెలుపడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. అజిజి భర్త కూడా గతంలో ఇజ్రాయెల్ దేశంలో చిక్కకున్నాడు.
ఇది కూడా చదవండి : విడాకులు తీసుకున్న స్త్రీలే అతడి టార్గెట్.. ఆరో భార్య ఫిర్యాదుతో