తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెలుగు వస్తున్న బిగ్ బాస్ సీజన్ 1 కి యన్టీఆర్ హూస్ట్ చేయగా.. సీజన్ 2 కి నాని వ్యాఖ్యాతగా వచ్చారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ప్రస్తుతం వస్తున్న సీజన్ 5 కి అక్కినేని నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే బిగ్ బాస్ లో చాలా వరకు సెలబ్రెటీలను తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో చాలా మందికి హెల్ప్ అవుతుంది.
కెరీర్ డల్ గా ఉన్న వాళ్లకి, ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్లకి బిగ్ బాస్ షోలో ఎంటర్ అయితే వాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోతుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వారికి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. అంతే కాదు చాల మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక స్టార్ సెలబ్రిటీలుగా మారి బాగానే సంపాదిస్తున్నారు. కార్లు కొనుక్కుంటున్నారు. ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న యూట్యూబర్ మెహబూబ్ కి మంచి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్, సోయల్, మెహబూబ్ మంచి మిత్రులుగా కొనసాగారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక మెహబూబ్ యూట్యూబ్ లో వీడియోలను తీస్తూ బిజీగా ఉన్నాడు. అంతే కాక ఈ మధ్య సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అంతే కాదు మెహబూబ్ డ్యాన్స్‌కు ముచ్చటపడిన మెగాస్టార్ తన తాజా చిత్రం `ఆచార్య`లో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చనట్టు సమాచారం.
రామ్ చరణ్ తో మెహబూబ్ ఓ కీలక సన్నివేశంలో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇదే నిజమైతే మెహబూబ్ పంటపండినట్టే అంటున్నారు. తాజాగా మెహబూల్ ఓ ఇంటివాడు అయ్యాడు.. సొంత ఇంటి కల నెరవేర్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెహబూబ్ సొంత ఇళ్ళు కట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఒక సొంతిల్లు ఉండాలని నా చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. మొత్తానికి అనుకున్నది సాధించాం. ఇది అంతా మీ అభిమానం.. ఆశీర్వాదం ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.