యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున చిత్రం ‘RRR’. ఈ సినిమాలోని రెండో పాట ‘నాటు నాటు’ను ఈ నెల 10న చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెపులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఫుల్ జోష్‌తో ఇద్దరు స్టార్ హీరోలు చిందుతొక్కితే ఇలా ఉంటుందని చూపించారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌కు అన్ని భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల సినీ అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా నాటు నాటు పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన అద్భుతమైన స్టెప్పులు ఎలా వేయాలో ఇద్దరు కుర్రాళ్లు నేర్పిస్తున్నారు. ఏ స్క్వేర్ క్రూ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఇద్దరు నార్తిండియన్ కుర్రాళ్లు అచ్చం ఎన్టీఆర్, రామ్ చరణ్ లెవల్ ఆఫ్ ఎనర్జీతో నాటు నాటు పాటకు స్టెపులు వేశారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారు వారి టాలెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఆ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ వీడియోపై ఒక లుక్కేయండి.
