ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు, ప్రముఖుల్లోను మంచి క్రేజ్ ఉంది. అందులోను బన్నీ డ్యాన్స్ కు చాలా మంది ఫిదా అవుతుంటారు. అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలకు పలువురు ప్రముఖులు స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేసి సంచలనం క్రియేట్ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మళ్లీ రంగంలోకి దిగాడు.
డేవిడ్ వార్నర్ మళ్లీ అల్లు అర్జున్ సాంగ్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. గత కొంత కాలంగా పలువురు హీరోల ఫేస్ మార్ఫ్ చేసి, వారి ఫేసులకు అనుగుణంగా తన ఫేస్‌తో డైలాగ్స్, డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తూనస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమాలోని ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా సాంగ్ కు డ్యాన్స్ చేశాడు వార్నర్.
అల్లు అర్జున్ ఫేస్‌ని తన ఫేస్‌తో మార్ఫ్ చేసి డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇండియన్ క్రికెటర్ కోహ్లీతో పాటు, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారంటే, వార్నర్ ఇమిటేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థమైపోతుంది. వార్నర్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియో 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది.
తన పాటకు మరోసారి డేవిడ్ వార్నర్ స్టెప్పులేయడంపై అల్లు అర్జున్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే.. అంటూ బన్నీ చేసిన కామెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ మాస్ స్టెప్పులు ఎవరిచేతనైనా డ్యాన్స్ చేయిస్తాయని ఆయన అభిమానులు చాలా గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.