టాలీవుడ్ మన్మథుడు ఎవరంటే.. వెంటనే అక్కినేని నాగార్జున అంటారు ఎవరైనా. అవును మరి.. 6 పదుల వయసులో కూడా చక్కని ఫిట్‌నెస్‌తో.. యంగ్ లుక్‌తో… కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తుంటారు నాగార్జున. ఫిట్‌నెస్, ట్రెండ్స్ విషయంలో ఇప్పటితరానికి గట్టి పోటీనిస్తుంటారు. ఇక నాగార్జున ఏదైనా కార్యక్రమానికి హాజరైతే తన హుషారైన మాటతీరుతో అందరిలో జోష్ నింపుతారు. ఇలా ఎప్పుడు ఉత్సాహంగా, సరదాగా, నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నాగార్జున ముఖం కళ తప్పింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. అయ్యో నాగార్జునకు ఏమైంది.. ఇలా మారిపోయారేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: నాగార్జునతో నా అనుబంధం చాలా స్పెషల్: టబు
కుమారుడు నాగచైతన్య విడాకుల విషయం తర్వాత నాగార్జున చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తున్నారు. సినిమా ప్రమోషన్లు మినహా.. మిగతా సమయాల్లో మీడియాకు దూరంగా ఉంటున్నాడు నాగ్. ఈ క్రమంలో తాజాగా ఆయన జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఇక అక్కడ నాగ్ ను చుసిన వారందరు షాక్ అయ్యారు. ముఖమంతా పీక్కుపోయి, వయస్సు మీదపడినట్లు కనిపించారు. నాగార్జునను ఇలా చూసిన ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్ లో నాగ్ యాక్టివ్ గా లేకుండా ముభావంగా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇది కూడా చదవండి: ఆ విషయంలో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య పోటీ మొదలైందా?ఈ వేడుకలో సినిమా గురించి రెండు ముక్కలు మాట్లాడి ఓకే అనిపించారు. ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఎన్నో విషయాలు మాట్లాడే నాగ్ ఇలా ముభావంగా మాట్లాడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే నాగ్ ఇలా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగ్.. ఘోస్ట్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడని, దాని వలన అలసిపోయి ముఖం డల్‌గా కనిపిస్తుందని కొందరు అంటుండగా.. మరికొందరు నాగ్ గత కొన్నిరోజుల నుంచి కొడుకుల భవిష్యత్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడని, అందుకే ఇలా మారిపోయాడని చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా నాగార్జున లో మునుపటి చార్మింగ్ కానీ, గ్లో కానీ లేదని, ఇలా ఉంటే ఆయన ఒరిజినల్ వయస్సు బయటపడుతుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తెగ ఫీలవుతున్నారు. కారణం ఏదైనా నాగ్ మళ్లీ మునుపటి రూపంలోకి తిరిగి వచ్చి హుషారుగా వరుస సినిమాలను లైన్లో పెట్టి సీనియర్ హీరోలకు గట్టి పోటీ ఇస్తాడేమో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హోస్ట్ నాగార్జున కాదా?