ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు..
ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. ఇక గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 288పైగా మరణించారు. ఈ రైలు ప్రమాద ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 288పైగా ప్రయాణికులు మరణించగా.. ఇంకా ఎంతో మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు వెంటనే స్పందించి రైలు పునరుద్దరణ పనులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ట్రైన్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి ఏడు డెడ్ బాడీల కింద కొన ఊపిరి తో ఉన్నా పదేండ్ల బాలుడ్ని తన అన్నయ్య రక్షించుకున్నాడు.
ఆ బాలుడు తీవ్రంగా గాయపడి.. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు చనిపోయాడని రెస్క్యూవర్కర్లు శవాల మధ్య పడేశారు. అయితే శుక్రవారం యాక్సిడెంట్ జరగ్గా.. శనివారం రోజు తన తమ్ముడిని వెతికి అక్కడ నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. ఆ క్రమంలోనే బాలాసోర్ లోని భోగరాయ్ కి చెందిన పదేండ్ల దేబశిష్ పాత్రా పేరెంట్స్, తన అన్నయ్య తో కలిసి కోరమాండల్ ఎక్సెప్రెస్ లో ఎక్కి ఒడిశాలోని భద్రక్ లో ఉంటున్న తన మామయ్య వాళ్ళ ఇంటికి బయలు దేరారు.. వెళ్లిన కొద్ది సమయానికే… అక్కడి నుంచి బాలాసోర్ స్టేషన్ దాటినారో లేదో గూడ్స్ రైలును ఢీకొట్టడంతో వెంటనే బోగీలు పట్టాల పైన అదుపు తప్పాయి. అయితే ఆ ప్రమాదంలో దేబశిష్ నుదురు కు ముఖం మీద తీవ్ర గాయాలు అయ్యాయి. అలా కావడంతో అతడు స్పృహ కోల్పోయాడు.
అయితే అతడు చనిపోయాడు అనుకొని మూటగట్టి అక్కడ శవాల మధ్య పడేశారు. అయితే దేబశిష్ అన్నయ్య తన తమ్ముడి ఆచూకి కోసం తీవ్రంగా వెతికాడు.. ఇంతలోనే.. మరసటి రోజున కూడా మళ్లీ వెతకసాగాడు. ఆ రోజు 7 డెడ్ బాడీల కింద తన తమ్ముడి ఆచూకీ లభించింది. అయితే తను ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకొని వెంటనే కటక్ లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.అతనికి మంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నామని తొందరలో రికవరీ అవుతున్నాడనీ డాక్టర్లు చెప్పడంతో.. తను ఆస్పత్రిలో దేబశిష్ మాట్లాడుతూ.. అమ్మ నాన్న అన్నయ్యతో కలిసి భద్రక్ వెళ్లాడానికి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కాను. అక్కడి నుంచి పూరి వెళ్లాలని ప్లాన్ చేశాము. నేను రైలులో అమ్మ పక్కన కూర్చున్న.. ఒక్కసారిగా భారీగా కుదుపు వచ్చింది. అంతలోనే నేను స్పృహ కోల్పోయాను. కండ్లు తెరిచి చూస్తే అంతా చీకటి మయం..అయితే నేను డెడ్ బాడీల కింద ఉన్నా అని తెలుసుకున్నానని దేబశిష్ చెప్పాడు.