కామారెడ్డి- ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల గురించి తెలిసిందే. సమాజంలో ప్రేమ పేరిట ఎన్ని వంచనలు జరుగుతున్నా.. ఇంకా ఎక్కడో చోట, ఎవరో ఓ అమ్మాయి దగాపడుతూనే ఉంది. ఇదిగో తాజాగా కామారెడ్డి జిల్లాలో ప్రేమను నమ్మి ఓ యువతి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాడు ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతికి దగ్గరయ్యాడు.
కట్టుకోబోయే వాడే కదా అని నమ్మిన ఆ అమ్మాయి అతనికి అన్నీ అర్పించికుంది. ఇంకేముందు పెళ్లి విషయం గురించి ప్రస్తావించడంతో అసలు విషయం బయటపడింది. ఆ నయవంచకుడికి అప్పటేకేపెళ్లై పెళ్లై భార్య, కూతురు ఉన్నారని తెలిసి ఆమె నివ్వెరైపోయింది. ఈ వ్యవహారం కాస్త పెద్ద మనుషుల పంచాయితీ వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ యువతి కుటుంబ సభ్యులు ఆమెకు మరో పెళ్లి సంబంధం నిశ్చయించారు.
ఆమెను మనశ్శాంతిగా ఉండనీయని ప్రియుడు రోజూ వేధింపులకు దిగడంతో యువతి అఘాయిత్యం చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మాచారెడ్డి మండలం ఫరీద్ పేటకు చెందిన 19 ఏళ్ల యువతిని అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు.
అతని మాటలు నమ్మి ఆమె సర్వస్వం వాడికి అర్పించుకుంది. పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి ఒత్తిడి చేయడంతో అసలు నిజం బయటపడింది. ఆ మోసగాడికి అప్పటికే పెళ్లి కావడమే కాజు, ఓ కూతురు కూడా ఉందని తెలియడంతో ఆ యువతి షాక్ తింది. ఇరువురి కుటుంబాల్లో విషయం తెలియడంతో పంచాయితీకి పెట్టి ఇద్దరిని మందలించారు.
దీంతో ఆ యువతికి ఇంట్లో మరో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. అప్పటికే పెళ్లి చేసుకుంటానని మోసగంచిన ఆ దుర్మార్గుడు ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. ప్రియుడి వేధింపులు భరించలేకపోయిన ఆ అమ్మాయి ఊరి శివారులో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.