బెంగళూరు- కరోనా అంటేనే అందరు భయపడి ఇంటికే పరిమిత మవుతున్నారు. పక్కవాళ్ళు కరోనా బారిన పడితే భయంతో దరిదాపుల్లోకి కూడా వచ్చే ధైర్యం చేయడం లేదు. ఇటవంటి సమయంలో ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ కరోనా రోగుల కోసం ఆంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరో అనిపించుకుంటున్నాడు అర్జన్. ఆంబులెన్స్ డ్రైవర్‌గా మారిన అర్జున్ గౌడ కరోనాతో మరణించిన వారి మృతిదేహాలను శ్మశానానికి తరలిస్తుండటం నిజంగా అభినందనీయం. అర్జున్ గౌడ ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ద్వారానే కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానానికి తరలిస్తున్నాడు. ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితుల్లో కరోనా మృతదేహాల అంత్యక్రియలు ఎంత కష్టంగా మారాయో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము. అంత్యక్రియలు చేసేందుకు గానీ, మృతదేహాలను తీసుకెళ్లేందుకు గానీ అంబులెన్స్ డ్రైవర్లు కూడా ముందుకు రాని పరిస్థిలుతు నెలకొన్నాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో కన్నడ సినీనటుడు అర్జున్ గౌడ ఇలాంటి సేవ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇటువంటి సేవ చేస్తున్నందుకు అర్జున గౌడ ను అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అన్నట్లు అర్జున్ గౌడ యువరత్న, రుస్తుమ్ లాంటి సినిమాలతో హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ రీల్ కమ్ రియల్ హీరోను చూసాకైనా మిగతా వారు కూడా సమాజ సేవకు నడుం బిగిస్తారని ఆశిద్దాం.