ఫుడ్ డెలివరీ సర్వీసెస్ లో జొమాటోకి మంచి పేరుంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని సిటీలు, పట్టణాల్లో జొమాటో సేవలు అందిస్తోంది. లాక్ డౌన్ సమయంలోనూ జొమాటో తమ సేవలను కొనసాగించింది. సర్వీసెస్ కే కాదు.. ప్రచారాల్లోనూ జొమాటో ముందుంటుంది. సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో వారి ప్రచారాలకు వాటిని వాడుకోవడం సహజం. అందులో జొమాటో ముందుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన పుష్పను జొమాటో బాగా వాడేసింది. ఆ నోటిఫికేషన్ అయితే నెక్ట్స్ లెవల్ అంటున్నారు వినియోగదారులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే జొమాటో నోటిఫికేషన్ కు ఫిదా అయిపోయారు.
పుష్ప ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ గా ఫహద్ ఫాసిల్ చేసివ విషయం తెలిసిందే. అందులో ఫహద్ ఒక డైలాగ్ ఉంటుంది. ‘పార్టీ లేదా పుష్ప’ అని ఇప్పుడు ఆ క్వశ్చన్ ను జొమాటో ప్రచారానికి వాడుతోంది. ‘పార్టీ లేదా పుష్ప.. అనే బదులు జొమాటోలో ఆర్డర్ చెయ్యిరా చిట్టి నాయుడు’ అంటూ వినియోగదారులకు నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆ రేంజ్ లో పబ్లిసిటీ చూసి కస్టమర్లు అవాకవుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ అయితే మా హీరో సినిమాని ఇలా కూడా వాడుతున్నారుగా అంటూ సంబర పడుతున్నారు. ఇది విన్- విన్ ఫార్ములా. ఇటు జొమాటోకి ప్రచారం జరుగుతుంది. జొమాటో నోటిఫికేషన్ ద్వారా పుష్ప సినిమాకి కూడా పబ్లిసిటీ అవుతుంది. జొమాటో నోటిఫికేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Was so Excited 2 THANKU all tonite on Stage 4 d Tremendous Love U showered on #PUSHPA audio❤️🙏🏻
But due 2 FINAL MIX WORK in 5 languages,not able 2 b there.
Missing all d Fun.Hope U all Enjoy d Event
See U all soon🕺🤗#PushpaMASSivePreReleaseParty @alluarjun @MythriOfficial pic.twitter.com/M1QZkBhpJ4— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 12, 2021