తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఉన్న క్రేజ్, రేంజ్ వేరు. ఎంతో మంది ఆర్టిస్ట్ లకి జీవితాన్ని ఇచ్చిన ఘనత ఈ కార్యక్రమానికి దక్కుతుంది. వీరంతా ఆ షోపై తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూపించుకుంటూ ఉంటారు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ఇప్పుడు దీనికి వేదిక అయ్యింది.
మొదట్లో సరదాగా సాగిపోయిన ఈ ప్రోమో.. శాంతి స్వరూప్ ఎంట్రీతో ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయింది. ప్రోమోలో శాంతి స్వరూప్ జబర్దస్త్ లోకి రాకముందు తన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నాడు. ఇక జబర్దస్త్ లో తనకి అవకాశాలు ఇచ్చి ఆదరిస్తున్న హైపర్ ఆదికి శాంతి స్వరూప్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది. మీరు కూడా ఈ వీడియోని చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
