నిఖిల్ విజయేంద్ర సింహా.. యూట్యూబర్, ఇన్‌ఫ్ల్యూఎన్సర్, యాంకర్, యాక్టర్ గా తనని తాను నిరూపించుకున్నాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తాను అనుకున్నది అనుకున్నట్లు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమ్ సాధించిన నిఖిల్ ఆ తర్వాత ఓ కామెడీ షో యాంకర్ గా కూడా చేశాడు. తాను పడ్డ కష్టానికి కేంద్రం అవార్డు రూపంలో ఫలితం దక్కింది.
స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సారుల కావొస్తున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మన సంస్కృతిని తెలియజెప్పేందుకు కృషి చేస్తున్న 75 మంది యూట్యూబర్/ఇన్‌ఫ్ల్యూఎన్సర్లను గుర్తించి కేంద్ర సాంస్కృతిక శాఖ సత్కరించింది. కల్చరల్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ అవార్డులు ప్రదానం చేశారు. తెలుగు నుంచి ఏకైక యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా అవార్డు దక్కించుకున్నాడు.
ఈ అవార్డు దక్కడంపై స్పందిస్తూ.. “కేంద్రం నుంచి తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డుతో యూట్యూబర్/ఇన్‌ఫ్ల్యూఎన్సర్ అనే వాళ్లపై ప్రజల అభిప్రాయం మారుతుందని భావిస్తున్నాను. ఈ అవార్డు ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు నుంచి ఏకైక యూట్యూబర్ గా ఈ అవార్డు అందుకోవడం ద్వారా నా బాధ్యత మరింత పెరిగిందని అనుకుంటున్నాను. నా కుటుంబం, ఫ్యాన్స్, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషుల ద్వారానే ఇది సాధ్యమైంది.” అంటూ నిఖిల్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. నిఖిల్ కి అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.