సాధారణంగా అభిమాన సినీ తారలు వయసు మీద పడుతున్నకొద్దీ ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త వినిపిస్తారా..? ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. పెళ్లి అయ్యిందో లేదో తెలియకుండా హీరోయిన్ తల్లి కాబోతుందనే వార్త వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వకతప్పదు. ఈ లివింగ్ టుగెదర్, పెళ్లి కాకుండానే తల్లి కావడం అనేది విదేశీ సంస్కృతిలో చూస్తుంటారు. కానీ కొన్నేళ్లుగా సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి చూస్తున్నాం.
తాజాగా దక్షిణాది లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార లాక్ డౌన్ సమయంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవలే వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ ఆలయంలో పూజలు చేశారు విఘ్నేష్, నయన్. ఆరోజు ఆమె నుదుటిన సింధూరం కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటినుండి నయన్ – విఘ్నేష్ పెళ్లి అయిపోయిందని ప్రచారం జరుగుతోంది.
చదవండి: సీక్రెట్ గా నయనతార- విఘ్నేష్ పెళ్లి! వైరల్ అవుతున్న వీడియో
ఇక పెళ్లి అయ్యిందో లేదో ఇంకా క్లారిటీ రాలేదని భావిస్తున్న తరుణంలో.. ఈ స్టార్ కపుల్ కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. నయన్ – విఘ్నేష్ పిల్లల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సరోగసి ద్వారా తల్లి కావాలని అనుకుంటుందట. దీనికి విఘ్నేష్ కూడా అంగీకరించడంతో ఇద్దరూ సరోగసి(అద్దె గర్భం) ద్వారా పేరెంట్స్ కానున్నారని కోలీవుడ్ వర్గాలలో టాక్ నడుస్తుంది.
ఇప్పటికే ఈ వార్త కోలీవుడ్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై నయన్ – విఘ్నేష్ లే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. చేతినిండా సినిమాలు ఉండటం కారణంగానే వీరిద్దరూ సరోగసి మార్గాన్ని ఎంచుకున్నారని కొన్ని తమిళ కథనాలు చెబుతున్నాయి. అసలు పెళ్లి అయ్యిందా లేదా? అనే సందిగ్ధంలో ఫ్యాన్స్ ఉండగా.. మధ్యలో ఇదెక్కడి మాస్ రా మావా అంటున్నారు నెటిజన్లు. మరి నయన్ – విఘ్నేష్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.