బాక్సాఫీస్ వద్ద కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అదికూడా కేవలం దక్షిణాది సినిమాలు మాత్రమే దేశవ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అందులోనూ బాలీవుడ్ ని సౌత్ డబ్బింగ్ సినిమాలే షేక్ చేయడం చూస్తున్నాం. ఇక గతేడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన సినిమా పుష్ప. స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. మంచి విజయాన్ని సాధించి, బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఇక సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ యాక్టింగ్ తో పాటు మాస్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అలాగే సినిమాలో పుష్పరాజ్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. చిన్న పిల్లల దగ్గర ఇంటర్నేషనల్ స్టార్స్ వరకూ అందరూ పుష్ప స్టైల్ ని అనుకరించారు. అయితే.. ఇప్పుడు అందరి ఎదురుచూపులు కూడా పుష్ప సీక్వెల్.. పుష్ప 2 కోసమే. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో.. ఫహద్ ఫాజిల్ విలన్(పోలీస్ ఆఫీసర్)గా కనిపించాడు.
ఈ క్రమంలో పుష్ప-2లో ఫహద్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడని.. సీక్వెల్ అంతా పుష్పరాజ్ – భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ మధ్య వార్ తోనే ఉంటుందని అంటున్నారు. అదీగాక ఎప్పుడో షూటింగ్ మొదలు కావాల్సిన ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ను.. ఆలస్యమైనా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఎట్టకేలకు ఇటీవల పుష్ప-2 పూజా కార్యక్రమం చేశారు. సెప్టెంబర్ నుండి షూటింగ్ మొదలుకానుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. పుష్ప-2 లో ప్రధాన విలన్ క్యారెక్టర్ వేరే ఒకటి ఉందని టాక్ బలంగా సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. పుష్పకు ఆల్రెడీ ఫహద్, సునీల్, ధనుంజయ విలన్స్ గా ఉన్నారు. అయితే.. సిండికేట్ విషయంలో బన్నీకి అండగా నిలిచిన ఎంపీ రావురమేష్ కి పైస్థానంలో ఉండే ఓ రాజకీయ నాయకుడి పాత్రతో కొత్త విలన్ ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. ఆ పొలిటిషన్ పాత్రకోసం నటుడు ఆది పినిశెట్టి పేరు ప్రస్తావనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పుష్ప సీక్వెల్ కి కొత్త విలన్ గా ఆది పినిశెట్టి కాకుండా.. సోషల్ మీడియాలో నెటిజన్స్, ఫ్యాన్స్ అంతా వేరే యాక్టర్ పేరును సూచిస్తూ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఇంతకీ ఫ్యాన్స్ ఎవరినీ డిమాండ్ చేస్తున్నారంటే.. హీరో గోపీచంద్ పేరునట. విలన్ గా గోపీచంద్ ఏ స్థాయిలో అల్లాడిస్తాడో అతని కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. అయితే.. ఆది పినిశెట్టి ఆల్రెడీ సరైనోడు సినిమాలో బన్నీకి విలన్ గా చేసి మెప్పించాడు. కానీ, ఇప్పుడు గోపీచంద్ అయితే ఆ పాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి చివరికి ఎవరు ఓకే అవుతారో పుష్ప టీమ్ ప్రకటించాల్సి ఉంది. మరి బన్నీకి విలన్ గా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.