ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా క్రేజ్, గ్లోబల్ రికగ్నిషన్ సొంతం చేసుకున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలలో హాజరయ్యేందుకు అమెరికా వెళ్ళాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.
చిత్రపరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా క్రేజ్, గ్లోబల్ రికగ్నిషన్ సొంతం చేసుకున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలలో హాజరయ్యేందుకు అమెరికా వెళ్ళాడు. అదే వేడుక కోసం ఎన్టీఆర్ కన్నా ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో వాలిపోయాడు. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చిన గ్లోబల్ రికగ్నిషన్, అవార్డులు.. అటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు సైతం దక్కింది. రీసెంట్ గా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో హెచ్.సి.ఏ అవార్డులు సైతం చరణ్, తారక్ లిద్దరికీ ప్రకటించారు. దీంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను రామ్ చరణ్ కి వచ్చిన అవార్డులు, నటుడిగా గుర్తింపు, క్రేజ్.. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ కి కూడా సమానంగానే వచ్చాయి. ఎన్టీఆర్ కి సైతం గ్లోబల్ స్టార్ అనే రికగ్నిషన్ దక్కింది. అయితే.. రామ్ చరణ్ కి అవార్డులు.. క్రేజ్.. ప్రశంసలు వస్తే.. మెగాఫ్యాన్స్ తో పాటు తండ్రిగా మెగాస్టార్, బాబాయ్ లుగా నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో పాటు ఎంతోమంది సెలబ్రిటీల నుండి విషెష్ వెల్లువెత్తాయి. అందరూ చరణ్ కి వచ్చిన గ్లోబల్ రికగ్నిషన్ ని ఎంతో ఎంజాయ్ చేస్తూ.. పండగ చేసుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్, ఫ్యామిలీ తమ కొడుక్కి దక్కిన గుర్తింపుని ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ.. సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
అదే ఎన్టీఆర్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ కి వచ్చినట్లే క్రేజ్, గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినప్పటికీ.. ఫ్యాన్స్ సపోర్ట్ తప్ప ఫ్యామిలీ నుండి ఎటువంటి ఎంకరేజ్ మెంట్ కనిపించట్లేదు. ముందునుండి ఎన్టీఆర్ అలాంటి వాతావరణంలోనే పెరుగుతూ వచ్చినప్పటికీ.. ఆస్కార్ రేంజ్ కి ఎదిగాక కూడా.. ఫ్యామిలీ నుండి సపోర్ట్, ప్రశంసలు లేకపోవడం బాధాకరం. ఇండస్ట్రీలో తాతకి తగ్గ మనవడిగా.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచుకున్నా.. ఇప్పటికీ ఎన్టీఆర్ ఒంటరి యోధుడిగానే పోరాటం చేస్తూ.. ముందుకు వెళ్తున్నాడు. తమ కుటుంబం నుండి స్టార్ హీరోలు ఉన్నా.. ఏ ఒక్కరూ ఎన్టీఆర్ విజయాన్ని ప్రశంసించడం, సెలబ్రేట్ చేసుకోవడం గాని చేయకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదగడాన్ని కేవలం ఫ్యాన్స్, ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి క్లోజ్ గా ఉండే సెలబ్రిటీలు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇన్ని విజయాలు, గొప్ప పేరు సాధించిన ఎన్టీఆర్ కి ఈ ఒక్క విషయంలో మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయిందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి ఇన్నేళ్ళైనా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎన్టీఆర్ ఒంటరి పోరాటం చేస్తూ.. ఎదగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
The high was unmatchable.🙏🙏🙏 #ManOfMassesNTR #JrNTR #GlobalStarNTR@tarak9999 pic.twitter.com/8ZPJXCFYR4
— ᛞᛁᛖ ᚺᚨᚱᛞ ᚠᚨᚾ ᛟᚠ ᚾᛏᚱ (@ROYAL_BELLAM) March 7, 2023
Man Of Masses #JrNTR giving autograph to his little fan in California is all things cute!! 😍♥️@tarak9999 #RRRForOscars #NaatuNaatuForOscars #NTR30 #TeluguFilmNagar pic.twitter.com/GgAg73pNsj
— Telugu FilmNagar (@telugufilmnagar) March 7, 2023
RC Andhuke Jr NTR Ni Chala Baga Chusukunadu reality lo ..💥😎@AlwaysRamCharan & @tarak9999 Bonding ❤️✨#RamCharan #JrNtr #Rc15 #NTR30 pic.twitter.com/ZjwjMpH9Jk
— Chennuru Sumanth Reddy ™ (@SumanthReddy__) March 2, 2023