సెలబ్రిటీ కపుల్స్ అంటే.. సామాన్యంగా అందరూ సినీ స్టార్స్ వైపే చూస్తుంటారు. సినీ స్టార్స్ అంటే అరుదుగా కనిపిస్తుంటారు. అదే టీవీ సెలబ్రిటీస్ అయితే ప్రతివారం ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంటారు. సినిమా పాపులారిటీ రేంజి పక్కన పెడితే.. టీవీ రేంజిలో మోస్ట్ పాపులారిటీని దక్కించుకున్న జోడి అంటే సుధీర్ – రష్మీ జోడినే. గత కొన్నేళ్లుగా ఈ జంట టీవీ ప్రేక్షకులను ఓ రేంజిలో ఎంటర్టైన్ చేస్తున్నారు.
వీరిద్దరి మధ్య లవ్.. ఫ్రెండ్ షిప్.. లేదు అంతకుమించి ఏదో ఉందంటూ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ షో వరకే అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ బుల్లితెరపై ఈ జంట పండించే రొమాంటిక్ – కామెడీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యూత్ అంతా ఈ జంట ఎప్పుడెప్పుడు తెరపై కనిపిస్తారా.. వీరి మధ్య సంభాషణ ఎప్పుడు జరుగుతుందా..? అని ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అయితే.. సుధీర్ టీవీ షోస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకొని అడపాదడపా సినిమాలు కూడా చేస్తున్నాడు. హీరోగా కూడా పలు సినిమాలు లైనప్ చేస్తున్నాడు. మరోవైపు తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ – ఢీ – శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ఆకట్టుకుంటున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోని తన యాంకరింగ్ తో నడిపిస్తున్నాడు. మరి సడన్ గా ఏమైందో తెలియదు కానీ.. సుధీర్ లేటెస్ట్ ప్రోమోస్ లో కనిపించలేదు.సుధీర్ కి ఫ్యాన్ బేస్ మాములుగా లేదు. ఇప్పుడు ఫాన్స్ అంతా సుధీర్ ని కావాలని షోస్ యాజమాన్యాలు పక్కన పెడుతున్నాయంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ఏ ఈవెంట్ జరిగినా అందులో సుడిగాలి సుధీర్ పక్కా ఉండాలి అనేవారే.. ఇప్పుడు కావాలని ఎందుకు పక్కన పెట్టేశారంటూ ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యే సుధీర్ లేని టీవీ ప్రోమోలు వస్తున్నాయి. ఈవెంట్స్, ఎపిసోడ్స్ జరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఢీ-14 నుండి సుధీర్‌తో పాటు రష్మి గౌతమ్‌ను కూడా తప్పించింది యాజమాన్యం. మరి సుధీర్ లేకుండా షోస్ ఇదివరకటి ఆదరణ ఎలా దక్కించుకుంటాయో చూస్తామంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో..! మరి సుధీర్ ని పక్కన పెడుతున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.