సినీ ఇండస్ట్రీలో నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లిల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం.. చిలికి చిలికి గాలివాన చందంగా పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వక్ సేన్ – దేవి నాగవల్లిల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లతో పాటు జనాలంతా చూసే ఉంటారు. వారిలో ముందుగా సహనం కోల్పోయింది ఎవరు…. ఒక అతిథిగా వచ్చిన వ్యక్తిని మానసికంగా డిప్రెషన్ కి గురయ్యారని మొహం మీదే చెప్పడం ఎంతవరకు కరెక్ట్.. అసలు ఒక వ్యక్తి మానసిక స్థితిని జడ్జి చేయొచ్చా లేదా అనేది ఆలోచించకుండా మాట్లాడటాన్ని పర్సనల్ ఎటాక్ అంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: విశ్వక్ సేన్ కోసం కదిలిన సినీ ఇండస్ట్రీ! స్టార్ హీరోలు వరుస ట్వీట్స్!
ఈ నేపథ్యంలో మెంటల్ హెల్త్ యాక్ట్ తెర మీదకు వచ్చింది. అసలు ఈ యాక్ట్ ఏంటి.. ఒక వ్యక్తి మానసిక స్థితి గురించి ఇది ఏం చేబుతుంది.. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఎలాంటి శిక్షలు విధించ వచ్చనే వివరాలను వెల్లడిస్తూ ప్రముఖ సామాజికవేత్త బాబు గోగినేని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. అంతేకాక విశ్వక్–దేవిల ఇద్దరిలో మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం.. చట్టాన్ని ఉల్లఘించింది ఎవరు? అనే అంశాన్ని ఈ పోస్ట్‌లో వివరించారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Vishnu Manchu: విశ్వక్ సేన్ కోసం మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్!
బాబు గోగినేని చేసిన పోస్ట్‌లో ఇలా ఉంది.. ‘‘మెంటల్ హెల్త్ యాక్ట్ ఉల్లంఘన అనేది శిక్షార్హమైన నేరం. దీనికి పాల్పడినవారికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చని కోర్టులు తెలుపుతున్నాయి. అసలు ఎలాంటి నిర్ధారణ లేకుండా… టీవీ ప్రోగ్రాం లైవ్‌లో.. సదరు నటుడిని డిప్రెస్డ్ పర్సన్ అని.. మానసిక ఆరోగ్యం సరిగా లేనివాడంటూ వ్యాఖ్యానించడం శిక్షర్హామైన నేరం. ఇక్కడ దేవి నాగవల్లి మానసిక ఆరోగ్య చట్టంలోని నిషేధాన్ని ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది. సరైన పద్దతిలో నిర్ధారించకుండా.. ఒక వ్యక్తిని మానసిక రోగి అని వ్యాఖ్యానించే, ప్రకటించే హక్కు ఎవరికి లేదు. ఒక వ్యక్తి మానసిక ఆరోగ్య స్థితిని గురించి మాట్లాడటం అనేది అతని గౌరవానికి సంబంధించింది. వైద్య చికిత్స కోసం తప్ప ఎక్కడా ఇలాంటి వివరాలు వెల్లడించకూడదు’’ అని పోస్ట్‌లో ఉంది.
ఇది కూడా చదవండి: Devi Nagavalli: 2 రోజులు తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చున్నాను: దేవి నాగవల్లి
‘‘ఇక ఈ వివాదం విషయానికి వస్తే.. నిజంగానే సదరు నటుడి మానసిక ఆరోగ్యం బాగాలేదని అనుకుందాం. అలాంటి వ్యక్తిని డిబెట్‌కు ఆహ్వానించడం అనేది ఉద్దేశపూర్వక నేరానికి నిదర్శనం’’ అని తెలిపారు. ఇది చూసిన నెటిజనులు.. అయితే దేవి నాగవల్లే మెంటల్ హెల్త్ చట్టాన్ని ఉల్లంఘించింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.