అసలే దీపావళి. ఆపై చలికాలం. ఇలాంటి టైంలో బయటేం తిరుగుదాం. మంచిగా ఇంట్లో కూర్చుని అలా మొబైల్ చూస్తూ గడిపేద్దాం. ఇలా అనుకునే వాళ్లు చాలామందే! అలా ఇన్ స్టా లేదంటే ఫేస్ బుక్ లో స్క్రోలింగ్ చేస్తుంటారు. మీమ్స్ చూస్తూ టైంపాస్ చేస్తుంటారు. అసలే పండగ సెలబ్రేషన్స్ తో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటారు. ఇలాంటి టైంలోనూ ఫొటో షూట్స్ తో పలువురు సెలబ్రిటీలు సెగలు పుట్టిస్తున్నారు. ధరించినవి సంప్రదాయ దుస్తులు అయినా సరే తగ్గేదే లే అంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ విష్ణుప్రియ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియా యూజ్ చేస్తున్న వారైతే ఆమెని అస్సలు మర్చిపోరు. ఎందుకంటే రోజూ ఫొటోషూట్స్ తో ఆమె.. కుర్రాళ్లని ఏ మాత్రం కుదురుగా కూర్చోనివ్వట్లేదు. చలికాలంలోనూ చెమటలు పట్టేంచేస్తోంది. ఇక సాధారణ రోజుల్లోనే ఓ రేంజ్ లో ఫొటోస్ పోస్ట్ అల్లాడిస్తుంది. అలాంటిది దీపావళి లాంటి వెలుగుల పండగ వస్తే ఈమె ఊరుకుంటుందా? సమస్యే లేదు. కాకపోతే మరీ అంత గ్లామర్ షో కాదు గానీ.. క్లాస్ గా దీపాన్ని చేతుల్లో పట్టుకుని పోజులిచ్చింది. ఇక్కడా కూడా కాస్తంత గ్లామర్ ని చూపిస్తూనే వచ్చిందండోయ్.
ఇక యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ.. సుడిగాలి సుధీర్ తో కలిసి ‘పోరాపోవే’ కామెడీ షోతే యాంకర్ గా మారిపోయింది. ఆ తర్వాత పండగల స్పెషల్ ఈవెంట్స్ తోపాటు ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ షోల్లోనూ సందడి చేసింది. ఈ మధ్య కాలంలో ‘పండుగాడ్’ అనే సినిమాలోనూ ఓ హీరోయిన్ గా చేసి బిగ్ స్క్రీన్ పైకి కూడా వచ్చేసింది. ఆ తర్వాత వేరే అవకాశాలు పెద్దగా వచ్చినట్లు లేవు. అందుకే ఇన్ స్టాలో మత్తెక్కించే ఫొటోలు పోస్ట్ చేస్తూ రచ్చ లేపుతోంది. మరి విష్ణుప్రియ.. దీపావళి ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.