సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్లు, కోళ్ల పందెలతో తెలుగు రాష్ట్రాల్లో సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. దాన్ని రెట్టింపు చేసేలా స్టార్ హీరోల సినిమాలు కూడా ప్రతి పండక్కి థియేటర్లలోకి వస్తుంటాయి. ఇంతకు ముందు ఏమో గానీ ఈసారి మాత్రం బీభత్సమైన రచ్చ ఉండనుంది. ఎందుకంటే ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొన్న మొన్నటి వరకు వినిపించింది. అందుకు తగ్గట్లే రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడెందుకో ‘వారసుడు’ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా చేసిన మూవీ ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. గతేడాది మేలోనే.. సంక్రాంతి రిలీజ్ ఉంటుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇక పండగ రేసులో చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ నిలిచినా సరే తన మూవీ విషయంలో దిల్ రాజు వెనక్కి తగ్గలేదు. ఇక డబ్బింగ్ సినిమాలకు తెలుగులో థియేటర్లు ఎలా ఇస్తారనే గత కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తూనే ఉంది. ఏదేమైనా తన ‘వారసుడు’ని జనవరి 11న తీసుకొస్తామని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లోనూ ప్రకటించారు.
అయితే సడన్ గా ‘వారసుడు’ తెలుగు వెర్షన్ రిలీజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అమెరికాలోనూ తమిళ వెర్షన్ ప్రీమియర్స్ మాత్రమే పడనున్నాయని తెలుస్తోంది. తెలుగుకు సంబంధించి ఇంకా టికెట్స్ రిలీజ్ చేయలేదు. అలానే తెలుగులోనూ ముందే చెప్పినట్లు జనవరి 11న థియేటర్లలో విడుదల కాకపోవచ్చని సమాచారం. తెలుగు వెర్షన్ కు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. సంక్రాంతికి చిరు-బాలయ్య మూవీస్ పోటాపోటీగా రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఇలాంటి టైంలో తన ‘వారసుడు’ని తీసుకొస్తే.. ఆ హీరోలతో రిలేషన్ దెబ్బతింటుందనే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారా అని నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ‘వారసుడు’ వాయిదా అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.