ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏ విషయం ఎందుకు బయటకొస్తుందో అస్సలు అర్థం కాదు. అది నిజమో కాదో తెలుసుకునేలోపు సోషల్ మీడియా అంతా కూడా పాకేస్తుంది. చాలామందికి అయితే అసలేం జరుగుతుందిరా బాబోయ్ అని జుత్తు పీకేసుకుంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ విషయంలో అలానే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కొన్నిరోజుల ముందు విజయ్, తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నాడనే అనే వార్తలొచ్చాయి. ఇప్పుడు దానికి కొనసాగింపు అన్నట్లు విజయ్, హీరోయిన్ కీర్తి సురేశ్ తో లవ్ లో ఉన్నాడని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది రూమర్ కాదని, ఇందులో నిజముందని చెప్పి కొన్ని అంశాల్ని పేర్కొంటున్నారు.
ఇక విషయానికొస్తే.. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ విషయం తెగ వైరల్ గా మారింది. ‘జస్టిస్ ఫర్ సంగీత’ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేసి.. హీరో విజయ్ ని ఫుల్ టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయంలోకి హీరోయిన్ కీర్తి సురేష్ ని కూడా లాగుతున్నారు. అయితే దీనంతటికి కారణం తమిళంలో ఓ వెబ్ సైట్ లో వచ్చిన కథనమే. ఇందులో భాగంగా.. విజయ్ ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని, భార్య చెప్పినా వినకుండా ఆమెతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని సదరు ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్, సదరు హీరోయిన్ కు మధ్య ఉన్న మేనేజర్ ని తీసేయమని సంగీత కోరిందట. అయితే విజయ్, తన భార్యని అస్సలు పట్టించుకోలేదట. ఇది కాదన్నట్లు తన సొంత డబ్బులిచ్చి మరీ అతడిని నిర్మాత చేశాడని, ఆయన నిర్మాణంలోనే సదరు హీరోయిన్ నటిస్తుందనే వార్తలు వినిపించాయి. దీంతో విజయ్-సంగీత మధ్య దూరం పెరిగిందని తమిళ మీడియాలో న్యూస్ వచ్చింది.
పైన చెప్పిన దాంట్లో సదరు హీరోయిన్ కీర్తి సురేష్ అని తెలుస్తోంది. గతంలో ‘భైరవ’, ‘సర్కార్’ సినిమాల్లో విజయ్ తో కలిసి కీర్తి సురేష్ నటించింది. విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబో లో తీస్తున్న కొత్త సినిమాలోనూ కీర్తినే హీరోయిన్ అని అంటున్నారు. మరోవైపు విజయ్ మేనేజర్ జగదీష్ నిర్మిస్తున్న ‘రివాల్వర్ రీటా’లోనే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తోంది. దీంతో విజయ్-కీర్తి మధ్య ఏదో రిలేషన్ ఉందనేలా పలువురు తమిళ నెటిజన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ఇక ఇక్కడితో ఆగకుండా పెళ్లి కూడా చేసేసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. అయితే సంక్రాంతికి వచ్చిన విజయ్ ‘వారిసు’.. హిట్ టాక్ తెచ్చుకోవడంతో కొందరు యాంటీ ఫ్యాన్స్ కావాలనే ఇలా చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. తెలుగులోనూ జీ తెలుగు న్యూస్, మనలోకం లాంటి వెబ్ సైట్స్ వాళ్లు.. విజయ్-కీర్తి సురేష్ రిలేషన్ అంటూ ఆర్టికల్స్ రాయడంతో టాలీవుడ్ లోనూ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి దీని గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.