సినిమా హీరోలకేంటెహే లగ్జరీ లైఫు, బోలెడంత డబ్బు, ఎంజాయ్‌మెంట్ అని అనుకుంటారు గానీ దాని వెనుక వాళ్ళు పడే కష్టం ఎవరికీ తెలియదు. తెర మీద ఎమోషన్స్ పండించే నటులు.. వారి పాత్రల కోసం చాలా హార్డ్‌వర్క్ చేస్తారు. లుక్, బాడీ లాంగ్వేజ్, భాష, యాస ఇలా ప్రతీ విషయంలోనూ శ్రద్ద తీసుకుంటారు. ముఖ్యంగా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాల కోసం బాడీ బిల్డింగ్ చాలా అవసరం. దీని కోసం ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. రోజూ గంటల గంటలు జిమ్‌లో గడపాల్సి ఉంటుంది. కథ డిమాండ్ చేస్తే ఎంత పెద్ద హీరో అయినా త్యాగాలు చేయాల్సిందే. ఇదే రూట్‌లో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయారు. లైగర్ సినిమా కోసం చాలా త్యాగాలు చేయాల్సి వచ్చిందట విజయ్‌కి.
బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ కావడంతో విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారట. ఏడాదిన్నర పాటు మంచి డైట్ ఫాలో అవుతూ, గంటలు గంటలు వర్కవుట్లు చేస్తూ ఈ ఫిజిక్‌ని తెప్పించుకున్నారట. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా, చాలా క్రమశిక్షణగా వర్కవుట్లు చేసేవారట. దీని కోసం మందు కూడా మానేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంత కఠినంగా ఉండడం వల్లే తనకి ఈ ఫిజిక్ సాధ్యమైందని అన్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఏడాదిన్నర పాటు కమిటెడ్‌గా వర్కవుట్లు చేసిన విజయ్ దేవరకొండపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.