అభిమానులని థియేటర్‌కి రప్పించాలంటే ఒక్క పోస్టర్ చాలు. కానీ ప్రేక్షకులని థియేటర్‌కి రప్పించాలంటే అలాంటి పోస్టర్లు ఎన్నున్నా సరిపోవు. ఆ సినిమా రిలీజయ్యే వరకూ ఏదో రకంగా జనాల్లో నానాలి. దానికి భిన్నమైన ప్రమోషన్ ఒక్కటే మార్గం. అందుకే సినిమా వాళ్ళు సరికొత్త ప్రమోషన్స్‌తో ట్రెండింగ్‍లో ఉంటారు. హీరోలు, హీరోయిన్లు కలిసి సినిమాని తమ భుజాల మీద వేసుకుని మరీ ప్రమోషన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ హీరో, హీరోయిన్లు మాత్రం లైగర్ సినిమాని ఒడిలో వేసుకుని మరీ ప్రమోట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఏకంగా హీరోయిన్ ఒడిలో పడుకుని మరీ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో చక్కెర్లు కొడుతున్న విజయ్, అనన్య పాండే జంట లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేశారు. బాగా తిరిగి తిరిగి అలసిపోయారేమో.. ట్రైన్‌లో ఓ కునుకు వేశారు. అనన్య పాండే ఒడిలో తల పెట్టి విజయ్ పడుకోగా.. హీరోయిన్ బ్యాక్ సీట్‌పై చేయి తలకి ఆనించి నిద్రపోయింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ‘తల’పెట్టిన కార్యం అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఈ మూవీకి సంబంధించిన మాస్ అప్‌డేట్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ‘వాట్ లగా దేంగే’ అంటూ సాగే మాస్ సాంగ్‌ను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ పాట పూరీ జగన్నాథ్ రాయగా, విజయ్ దేవరకొండ పాడారు. దీంతో ఈ పాటకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీతో అటు పూరీ, ఇటు విజయ్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారని, ఈ మూవీ ఇండియాని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ కాబోతుంది. మరి అనన్య పాండే ఒడిలో నిద్రపోతూ ఫోజు ఇచ్చిన విజయ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.