లైగర్ చిత్రంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యావత్తు దేశాన్ని షేక్ చేసింది. ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతుండడంతో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ నుండి అభిమానుల వరకూ ప్రతీ ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ దెబ్బతో మా పూరీ మావ, మా రౌడీ స్టార్ ఎక్కడికో వెళ్ళిపోతారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాక్సర్‌గా కనిపించనున్న విజయ్, 14 మంది అమ్మాయిలతో తలపడనున్నాడట. క్లైమాక్స్‌లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో రింగులో పోరాడడం ఒక ఎత్తు ఐతే.. ప్రీ క్లైమాక్స్‌లో 14 మంది లేడీ ఫైటర్స్‌తో తలపడనుండడం మరో ఎత్తు. 14 మంది అమ్మాయిలతో ఫైట్‌ను డిజైన్ చేశారట పూరీ జగన్నాథ్. ఈ సీన్ సినిమాకే హైలైట్‍గా ఉంటుందని అంటున్నారు. ఈ సీన్ కోసం ఎక్కువ సమయం కేటాయించారట పూరీ జగన్నాథ్.
ఇక మైక్ టైసన్‌తో క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీన్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఐతే అంతమంది లేడీ బాక్సర్స్‌తో విజయ్ చేసే ఫైట్ సీన్ మాత్రం థియేటర్‍లో అరుపులు పెట్టిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. విజయ్ ఊర మాస్ పెర్పార్మెన్స్‌ని చూడాలంటే ఆగస్ట్ 25 వరకూ వేచి ఉండాల్సిందే. మరి 14 మంది లేడీ ఫైటర్స్‌తో విజయ్ చేసే ఫైట్ సీన్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.