నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు.. రాజకీయాల్లో రాణిస్తాడా లేదా అనే దాని గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
సినిమాలు, రాజకీయాల్లో వారసుల ఎంట్రీ కామన్. ఒక వ్యక్తి హీరోగా నిలదొక్కుకున్నాడంటే.. ఆ తర్వాత అతడి కుటుంబంలో మరి కొందరు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక హీరోలు తమ పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువస్తారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడమే కాక.. కొందరు సూపర్ స్టార్లుగా కూడా రాణిస్తున్నారు. ఇక మరికొందరు వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారసుల జాబితాలో.. ముందు వరుసలో ఉన్నాడు నందమూరి మోక్షజ్ఞ.
బాలయ్య వారసుడిగా.. మోక్షజ్ఞను వెండి తెర మీద చూడటం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం పక్క. అయితే దానికి ఇంకా ముహుర్తం సెట్ కావడం లేదు అంటున్నారు సన్నిహితులు.
ఈక్రమంలో సెలబ్రిటీల భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నందమూరి మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోక్షజ్ఞ సినీ కెరీర్‌పై హాట్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు.. కానీ ఆసల్యంగా వస్తాడు. అయితే లేట్‌గా వచ్చినా సరే.. తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడు. సినీ రంగంలో మోక్షజ్ఞకు మంచి భవిష్యత్తు ఉంది. అభిమానులను అలరించి.. స్టార్‌గా ఎదుగుతాడు అని చెప్పుకొచ్చారు. అలానే మోక్షజ్ఞ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నందమూరి వారసుడు కాబట్టి.. పొలిటికల్ ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో మోక్షజ్ఞ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనే దాని గురించి కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మోక్షజ్ఞ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడని.. సినిమాలే తనకు క్రేజ్ పెంచుతాయని తెలిపాడు. వేణు స్వామి కామెంట్స్ వైరలవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మోక్షజ్ఞ బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ చూస్తుంటే ఈ విషయం క్లియర్‌గా అర్థం అవుతోంది.
ఇక బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారని, త్వరలోనే బాలయ్య వారసుడు కెమెరా ముందుకొస్తారని వార్తలు వస్తున్నాయి. అంతేకాక బాలకృష్ణ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఆదిత్య 369 సీక్వెల్‌తోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని బాలకృష్ణ ఇది వరకే ప్రకటించాడు. అంతేకాక ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కాగా బాలకృష్ణ సొంతంగా ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నారని, ఆ నిర్మాణ సంస్థ ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండేలా ప్లాన్స్ చేస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. మరి మోక్షజ్ఞ భవిష్యత్తుపై వేణు స్వామి చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.