పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియాని ఉపయోగించుకుని సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. సినిమా రిలీజ్ కి ముందు గలీజ్ గా వివాదాలు సృష్టించడం వర్మ స్టైల్. ఇక రీసెంట్ గా తన డేంజరస్ మూవీ ప్రమోషన్ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని అప్లై చేశారు. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చుని.. ఇంటర్వ్యూ చేశారు. అంతేనా అషు రెడ్డి కాలిని ముద్దాడిన ఫోటోలని కూడా షేర్ చేశారు. దీంతో వర్మ దిగజారిపోయారు అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. శివ, క్షణం వంటి సెన్సేషనల్ మూవీస్ తీసిన వర్మనేనా? ఇలా ఒక అమ్మాయి పాదాల దగ్గర కుక్కలా ఉండాల్సిన కర్మ వర్మకి ఎందుకొచ్చింది? అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వర్మ ఇవేమీ పెద్దగా పట్టించుకోరు, పిచ్చ లైట్ తీసుకుంటారు. అది కూడా మూవీ ప్రమోషన్ లో భాగంగానే ఇలా చేశారు. మూవీ ప్రమోషన్ కోసం అషు రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏం కర్మ.. తనను తాను కుక్కతో పోల్చుకోవడానికి కూడా వెనుకాడరు వర్మ. అవును అసలు తాను ఇలా అషు రెడ్డి పాదాల దగ్గర కూర్చోవడానికి ఒక కుక్కని ఆదర్శంగా తీసుకున్నానని చెప్పుకొచ్చారు. లెస్బియన్ కథతో తెరకెక్కిన డేంజరస్ సినిమాలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం అషు రెడ్డితో ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ.. ఆమె పాదాల దగ్గర కూర్చున్న డేంజరస్ ఎమోషన్ కి ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో నటించిన అప్సర రాణి పెంచుకుంటున్న కుక్క అట.
నేను అషు రెడ్డి పాదం వద్ద కూర్చున్న ఘటనను డేంజరస్ ఎమోషన్ అని ఫీలవుతున్నానో.. దాన్ని నేను అప్సర రాణి కుక్క దగ్గర నేర్చుకున్నా అని వర్మ పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేసి.. తన పైత్యాన్ని, పిచ్చిని సమర్ధించుకునే ప్రయత్నం చేసారు వర్మ. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ గా ఇలాంటి జుగుప్సాకర పనులేంటని, అషు రెడ్డి పాదాలు పట్టుకోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. వర్మ అభిమానులు మాత్రం మీరేం తగ్గద్దు సార్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏమన్నా వర్మ మాత్రం తాను చేయాలనుకున్నదే చేస్తారు.