నార్మల్ టైంలో సినిమాల రిలీజ్ అంటే ఓ మాదిరిగా ఉంటుంది. కానీ సంక్రాంతికి రిలీజ్ అంటే మాత్రం ఆయా చిత్రాలపై ఓ రకమైన ఎక్స్ పెక్టేషన్స్ కచ్చితంగా ఉంటాయి. అందుకే తెలుగులో కావొచ్చు, తమిళంలో కావొచ్చు స్టార్ హీరోలు.. తమ మూవీస్ ని ఈ పండక్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు. అలా ఈ ఏడాది తెలుగులో చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా వచ్చేస్తున్నారు. ఇక తమిళంలో అజిత్ ‘తునివు'(తెలుగులో తెగింపు) సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇతడితో పాటే విజయ్ కూడా ‘వారిసు’ అని విడుదలైపోయింది. అయితే ఈ మూవీ తమిళ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తెలుగులో మాత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా రివ్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
ఇక కథ విషయానికొస్తే.. రాజేంద్రన్ (శరత్ కుమార్) మల్టీ మిలియనీర్. తన బిజినెస్ లో ఎప్పుడూ సక్సెస్ కావాలని అనుకుంటూ ఉంటాడు. తన ఇద్దరు కొడుకులు తన కంపెనీలో పనిచేస్తుంటారు. మూడో కొడుకు విజయ్ మాత్రం ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటాడు. తండ్రి తీరు నచ్చక ఇంట్లో నుంచి బయటకెళ్లిపోతాడు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల తిరిగి ఇంటొకొస్తాడు. ఫ్యామిలీ, బిజినెస్ సమస్యలని ఎలా క్లియర్ చేశాడు? చివరకు ఏం జరిగింది అనేది స్టోరీ. ఇక ట్రైలర్ లో చూపించినట్లే సినిమా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో రిచ్ గా తీశారు. విజయ్ వన్ మ్యాన్ షో చూపించగా, దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంతో ఆకట్టుకున్నారు.
ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే.. యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్, కామెడీ విషయంలో విజయ్ అద్భుతంగా చేసినట్లు తెలుస్తోంది. అలానే చాలారోజుల తర్వాత ఎమోషనల్ సీన్స్ తోనూ అదరగొట్టినట్లు సమాచారం. మెయిన్ గా క్లైమాక్స్ లో తల్లి జయసుధతో ఉండే ఎపిసోడ్ అంతా మూవీకే మేజర్ హైలెట్ అని చెబుతున్నారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. ట్రైలర్ చూడగానే మీకు స్టోరీ చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. అందుకు తగ్గట్లే సినిమా కూడా ఉంది. పలు తెలుగు సినిమాల్ని కలిపి తీసినట్లు ఉందని పలువురు రివ్యూయర్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ , కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ.. విజువల్ ఎఫెక్ట్స్, సినిమా నిడివి కాస్త ఇబ్బంది పెడతాయట. ఏదైమైనా సంక్రాంతి పండక్కి ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడాలనుకుంటే మాత్రం ‘వారసుడు’ ట్రై చేయొచ్చు. తమిళంలో ఆల్రెడీ రిలీజైపోయింది. తెలుగులో మాత్రం జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. మరి ‘వారసుడు’ మూవీపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#Varisu – 3.25 out of 5, A feel-good family entertainer with ample mass moments and good message. Will definitely work with the masses and families. #ThalapathVijay and @directorvamshi have delivered an enjoyable entertainer for this Pongal!
— Rajasekar (@sekartweets) January 10, 2023