ఉర్ఫీ జావేద్.. ఈ పేరు గురించి ఇంటర్నెట్ జనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటిగా బిజీ అవుదాం అని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. నటిగా తప్ప మిగతా అన్ని విషయాల్లో బిజీ అవుతోంది. ముఖ్యంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. లక్నోలో పుట్టిపెరిగిన ఉర్ఫీ.. మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత నటిగా అవకాశాల కోసం బాలీవుడ్ వైపు అడుగులేసింది. అయితే.. ఉర్ఫీ గురించి మాట్లాడుకోవాలంటే.. ఫోటోషూట్స్ గురించే మాట్లాడాల్సి ఉంటుంది. మోడలింగ్ లో.. ముఖ్యంగా ఇండియాలో ఎన్నడూ చూడని డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ ని ప్రవేశ పెడుతోంది ఉర్ఫీ.
అవును.. నటన కోసమే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, అవకాశాలు లేక బోల్డ్ ఫోటోషూట్స్ తో జనాల మైండ్ బ్లాక్ చేస్తోంది. టాప్ టు బాటమ్ అన్ని అందాలను కురచ దుస్తులతో కవర్ చేసి.. ప్రతిసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇన్నాళ్లు ఎలా ఉన్నప్పటికీ.. తాజాగా గతంలో ఎప్పుడు లేనంత ఘాటుగా.. తన అందాలను బ్రేక్ ఫాస్ట్ గా ఫ్యాన్స్ కి అందించింది. ఉర్ఫీకి పబ్లిక్ ప్లేస్ అయినా.. ఇల్లైనా ఒకటే. అందుకే ఎక్కడున్నా ఫోటోలకు ఫోజులిచ్చి.. ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం మాత్రం మానలేదు. కొత్త పోస్ట్ లో ఉర్ఫీ ఒంటిపై నూలుపోగు లేకుండా అర్దనగ్నంగా దర్శనమిచ్చింది. ఏకంగా పై అందాలను కేవలం ఓ ప్లేట్, గ్లాస్ తో కవర్ చేసింది. ప్రస్తుతం ఉర్ఫీ పోస్ట్ చర్చనీయాంశంగా కాకుండా వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా.. ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టినప్పటికీ, తొందరగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే ఆలోచనతో ప్రయత్నాలు చేసింది. కానీ, అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో పాల్గొని.. తన గ్లామర్ తో రచ్చ చేసింది. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీవైపు ట్రయిల్స్ వేసింది. కానీ.. ఏది కుదరకపోవడంతో గతేడాది నుండి సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో ఒళ్ళంతా షో చేస్తూ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా యూత్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా కురచ దుస్తులను, అన్ని కనిపించే కాస్ట్యూమ్స్ ని ఫాలో అవుతుందట. ప్రస్తుతం ఉర్ఫీకి ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. మరి ఉర్ఫీ జావేద్ కొత్త పోస్ట్ గురించి మీ కామెంట్స్ లో తెలియజేయండి.