అన్‌స్టాపబుల్ షో.. క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సీజన్ 1 భారీ సక్సెస్ సాధించడంతో.. సీజన్ 2ని ప్రాంరభించింది ఆహా. ఇక సీజన్ 1ని మించి.. సీజన్ 2 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ క్రియేట్ చేసిన.. చేయబోతున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌ను.. రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ చేశారు ఆహా నిర్వాహకులు. తొలి ఎపిసోడ్.. డిసెంబర్ 30న, రెండో ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ అయ్యింది. ఇక తొలి ఎపిసోడ్.. మొత్తం ప్రభాస్‌తోనే సాగింది. ఇక రెండో ఎపిసోడ్‌లో ప్రభాస్‌తో పాటు ఆయన స్నేహితుడు గోపీచంద్ కలిసి సందడి చేశాడు. ఈ ఎపిసోడ్‌తో.. వీరిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో ప్రేక్షకులకు అర్థం అవుతోంది. ఇక రెండో ఎపిసోడ్‌లో బాలయ్య.. ప్రభాస్, గోపీచంద్ ఇద్దరితో ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు.
ఇక సెకండ్ ఎపిసోడ్ ప్రొమోలో బాలయ్య.. అడిగిన ఓ ప్రశ్న.. అందరిని ఆకట్టుకుంది. దీనికి ప్రభాస్, గోపీచంద్ ఎలాంటి సమాధానం చెబుతారా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూడసాగారు. 2008లో మీరిద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారు.. ఎవరి కోసం అంటూ బాలయ్య.. గోపించద్‌ను ప్రశ్నించాడు. అప్పుడు ప్రభాస్.. నాకు సంబంధం లేదు.. గోపీకే తెలుసు అన్నాడు. అప్పుడు గోపీచంద్.. 2008 కాదు సార్.. 2004లో అనుకుంటా.. మేమిద్దరం ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డాం అన్నాడు. అప్పుడు బాలయ్య ఎవరా హీరోయిన్ అంటే.. త్రిష అన్నాడు.
ఆ ఆన్సర్ విని.. బాలకృష్ణతో పాటు ప్రభాస్ కూడా షాకయ్యాడు. తన గురించి మనం ఎప్పుడు కొట్టుకున్నాం రా అన్నట్లు గోపీచంద్ వైపు ఓ లుక్కేశాడు. అప్పుడు గోపీచంద్.. వర్షం సినిమాలో.. మేమిద్దరం త్రిష కోసం కొట్టుకున్నాం సార్ అని చెప్పి.. క్లారిటీ ఇచ్చాడు. వర్షం సినిమాలో ప్రభాస్ హీరో కాగా.. గోపీచంద్ విలన్. వీరిద్దరూ ఆ సినిమాలో హీరోయిన్ అయిన త్రిష కోసం కొట్టుకున్నారు. ఆ విషయాన్ని గోపీచంద్ తెలివిగా ఇలా చెప్పాడు. అందుకు బాలయ్య.. నీ ఒంగోలు తెలివితేటలు ఇక్కడ చూపకు అంటూ సెటైర్లు వేశాడు. మొత్తానికి ప్రొమోతో అందరిలో క్యూరియాసిటీ పెంచిన ఈ ప్రశ్నకు.. గోపీచంద్ ఇలా తెలివిగా ఆన్సర్ చెప్పి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ 2 ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. మరి ఇది ఎన్ని రికార్డులు సృష్టించనుందో తెలియాలి.