బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా రేంజ్ సినిమాలే. ఇక తాజాగా ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం రాధేశ్యామ్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్టె డిజాస్టర్‌గా నిలిచిపోయింది. అయితే సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం అనేది మన చేతిలో ఉండదు. పైగా కావాలని ఎవరు ఫ్లాప్ సినిమా చేయాలనుకోరు. అయితే కొన్నిసార్లు కథ వినగానే తమకు సెట్ అవ్వదు అనిపించినా.. కానీ మొహమాటం కొద్ది ఆ సినిమాకు ఓకే చెప్తారు కొందరు నటులు. ప్రభాస్ కూడా అలానే మొహమాటనికి పోయి ఎస్ చెప్పిన చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: హీరో ప్రభాస్ కు సర్జరీ! షాక్ లో డార్లింగ్ ఫ్యాన్స్
క్లాస్ సినిమాల వైపు అడుగులు వేసి.. తనకు సెట్ కాని ఇమేజ్ కోసం ప్రయత్నించి చాలాసార్లు ఫ్లాపులు కొని తెచ్చుకున్నాడు ప్రభాస్. నాటి పౌర్ణమి నుంచి నేటి రాధే శ్యామ్ వరకు కంటిన్యూ అయింది. ఇదిలా ఉంటే ప్రభాస్ కెరీర్ మొత్తంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చక్రం. కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో దారుణంగా నిరాశ పరిచింది. చక్రం సినిమా విడుదలై మార్చ్ 25కి సరిగ్గా 17 ఏళ్ళైంది. ఈ సినిమా చేసే ముందు చాలా మంది ప్రభాస్‌ను హెచ్చరించారు. కథ బాగానే ఉన్నా మన వాళ్లకు కనెక్ట్ అవ్వదు.. రిస్క్ తీసుకోవద్దు అంటూ చెప్పారు కూడా. అయినా కూడా ప్రభాస్ డేర్ చేసాడు. మొత్తానికి మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది.
ఇది కూడా చదవండి: ‘రాధే శ్యామ్’ రిజల్ట్ పై పూజాహెగ్డే షాకింగ్ కామెంట్స్!చక్రం సినిమా విడుదలై 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అప్పటికి తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ప్రేక్షకులు చూడరు అనే నానుడి ఉంది. అందుకే ప్రభాస్ అలాంటి కథ ఎంచుకున్నాడని తెలిసి.. ఆయన శ్రేయోభిలాషులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చక్రం సినిమాను చేయొద్దంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అందులో చిరంజీవి ముందున్నారు. ఆ తర్వాత వారిలో గోపీచంద్ కూడా ఉన్నాడు. మరీ ఇంతలా ప్రయోగాలు అవసరం లేదు.. ఆలోచించుకో అని చెప్పాడట.
ఇది కూడా చదవండి: ప్రభాస్ పిల్లలను ఎత్తుకోవాలని ఉంది: రెబల్‌స్టార్ కృష్ణంరాజు
ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. తరుణ్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా ఇలాంటి ప్రయోగాలు వద్దని చెప్పినా వినలేదు ప్రభాస్. కేవలం ఆయన మొహమాటం కారణంగా కృష్ణవంశీకి మాటిచ్చేసాడు. ఇచ్చిన మాట కోసం చక్రం సినిమా చేసాడు. నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా ఈ సినిమా భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాలో ఛార్మి, అసిన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలోని జగమంత కుటుంబం పాట చాలా ఫేమస్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజయేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.