సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఉమైర్ సంధు పేరు తెలిసే ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఈ పేరు బాగా వైరల్ అవుతుంటుంది. విడుదలకు ముందే సినిమాలకు సంబంధించి రివ్యూలు ఇచ్చేస్తుంటాడు. అవి సక్సెస్ అయిన దానికంటే బోర్లాపడిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి.
ఉమైర్ సంధు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి, సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఈ పేరు సుపరిచితమే. తనని తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా చెప్పుకుంటూ ఉంటాడు. తన ట్విట్టర్ ఖాతా బయోలో తన గురించి.. సౌత్ ఏషియాలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ క్రిటిక్, బాలీవుడ్ గాసిప్ జర్నలిస్ట్ అని రాసుకున్నాడు. ఆ మాటలు ఏమాత్రం పొల్లు పోకుండా అతను ఆలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ బాలీవుడ్, టాలీవుడ్ లో ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతున్నా ఇతని పేరు బాగా వైరల్ అవుతుంది. అప్పుడప్పుడు బాలీవుడ్ నటీనటులపై దారుణమైన పోస్టులు పెడుతూ వైరల్ అవుతుంటాడు. తాజాగా ఓ నటిపై అలా పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఉమైర్ సంధుని గట్టిగానే చిక్కుల్లోకి నెట్టినట్లైంది.
ఉమైర్ సంధు సినిమాల విషయంలో ముందుగానే రివ్యూలు చెప్తుంటాడు. అసలు అతను చూసి చెప్పాడా? లేక గాల్లో బాణాలు సంధించాడా? అర్థమే కాదు. ఇప్పటివరకు అతను బ్లాక్ బస్టర్ అని చెప్పిన కొన్ని సినిమాల లిస్టు చూసుకుంటే మీకు కూడా అదే అనుమానం రాకమానదు. తెలుగులో అయితే.. కాటమరాయుడు, అజ్ఞాతవాసి, స్పైడర్, సాహో, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, రాధేశ్యామ్, బీస్ట్ వంటి సినిమాలకు బ్లాక్ బస్టర్ రేటింగ్ ఇచ్చాడు. అవి కాస్తా టాలీవుడ్ లో ప్రేక్షకులను డీలా పరిచిన విషయం తెలిసిందే. కొన్నిసార్లు బాలీవుడ్ నటీనటుల మధ్య అఫైర్లు ఉన్నాయంటూ పోస్టులు పెట్టాడు. ఇప్పుడు మరీ దారుణంగా ఓ ‘నటి తండ్రీకొడుకులతో పడుకుంది’ అంటూ చేసిన పోస్టు దుమారం రేపింది.
#CelinaJaitley is the only Actress in Bollywood who slept with both Father ( Feroze Khan ) & son ( Fardeen Khan ) many times. pic.twitter.com/dMeCsQFFne
— Umair Sandhu (@UmairSandu) April 10, 2023
తాజాగా బాలీవుడ్ నటి సెలీనా జైట్లీపై ఉమైర్ సంధు ఒక దిగజారుడు ట్వీట్ వదిలాడు. ‘తండ్రీ కొడుకులతో పడుకున్న ఏకైక నటి సెలీనా జైట్లీ’ అంటూ ట్వీట్ చేసి రచ్చ మొదలు పెట్టాడు. ఆ ట్వీట్ పై సెలీనా జైట్లీ స్పందిస్తూ.. “ఇలాంటి పోస్టులు చేయడం వల్ల నీకు ఆనందం, మగాడ్ని అనే భావన కలుగుతుందేమో. నీకున్న సమస్యను తగ్గించడానికి మరికొన్ని మార్గాలు ఉన్నాయి. బహుశా నువ్వు డాక్టర్ ని కలిస్తే మంచిది” అంటూ సెలినా జైట్లీ ట్వీట్ చేసింది. ట్విట్టర్ సేఫ్టీని ట్యాగ్ చేస్తూ ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. అందుకు ఉమైర్ సంధు “నువ్వొక సీ గ్రేడ్ నటివి. నీ ఫిల్మోగ్రఫీ చూస్తేనే తెలుస్తుంది. నువ్వు చేసిన సినిమాలు ఏంటి? 2003 ఆడిషన్స్ సమయంలో నువ్వు నగ్నంగా నిల్చున్నావ్” మరింత రెచ్చిపోయాడు. ఉమైర్ సంధు ట్వీట్ల విషయంలో సెలబ్రిటీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. నెటిజన్స్ ఈ ఫేక్ రివ్యూవర్ ని వదలకండి.. పరువునష్టం దావా వేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
Oh Just Shutup ! You were a C Grade Actress. Look at your Filmography. You always did Soft Porn Films. Ok ! Married with a Rich guy & then settled down ! Selfish woman. @TwitterSafety this psychopath is harassing me. Take notice. https://t.co/gZg1usZzTa
— Umair Sandhu (@UmairSandu) April 11, 2023
Sach Kafi Zaiyda Karwa Lag gaya !! Bataon sub ko ! You were naked infront of Director Feroze Khan in his office during Janasheen auditions in 2003. https://t.co/gZg1usZ23C
— Umair Sandhu (@UmairSandu) April 11, 2023