వాళ్లిద్దరూ సీరియల్ యాక్టర్స్. ఎప్పటినుంచో బుల్లితెరపై నటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లైవ్ లోనే గొడవపడ్డారు. అది కాస్త ఇష్యూ అయింది. వీడియో కూడా వైరల్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు చూసేవాళ్లకంటే టీవీ సీరియల్స్ చూసేవాళ్లు చాలా ఎక్కువ. సాయంత్రం అయితే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అలా చాలామంది సీరియల్ భామలు.. బోలెడు మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడంటే కొత్తవాళ్లు, అది కూడా తమిళ, కన్నడ నుంచి చాలామంది తెలుగు సీరియల్స్ లో చేస్తున్నారు. అప్పట్లో అయితే తెలుగు భామలు చాలామంది సీరియల్స్ లో హీరోయిన్స్ గా చేశారు. అలాంటి వారందరూ ఇప్పుడు టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. అలా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కనిపించారు. ఏకంగా కొట్టుకుని మరీ గొడవపడ్డారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీవీ షోలు ప్లెయిన్ గా జనాలు చూడరనో ఏంటో గానీ, ప్రతి ప్రోమోని సమ్ థింగ్ కాంట్రవర్సీగా కట్ చేస్తున్నారు. ఇక ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఆర్గనైజర్స్ అయితే ఇందులో దిట్ట అనే చెప్పాలి. దాదాపు ప్రతిసారి కూడా ఇద్దరూ యాక్టర్స్ మధ్య గొడవ పెట్టడం, ఒకరిని మరొకరితో తిట్టించడం లాంటి పనులు చేస్తుంటారు. ఈ విషయంలో నెటిజన్స్ నుంచి విమర్శలు కూడా ఫేస్ చేస్తుంటారు. అయినప్పటికీ షో ఫార్మాట్ లో పెద్దగా మార్పేం ఉండదు. అయితే తాజాగా జరిగింది మాత్రం నిజమనిపించేలా ఉంది. ఎందుకంటే వ్యక్తిగత విషయాల్ని షోలోకి తీసుకొచ్చి ఒక నటి చెంపపై మరో నటి గట్టిగా కొట్టింది.
వచ్చే ఆదివారం ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు’ పేరుతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోని టెలికాస్ట్ చేయనున్నారు. ఇందులో ఆదితో పాటు సీరియల్స్ యాక్టర్స్ భావన, కరుణ భూషణ్ కూడా ప్రధానంగా ఫెర్ఫార్మెన్సులు ఇస్తూ కనిపించారు. అయితే ఓ టాస్కులో భాగంగా బంతిని తీసుకొచ్చి యాంకర్ రష్మికి ఇచ్చిన వాళ్లు విన్నర్ అవుతారు. అలా ఈ రౌండ్ లో భావన గెలిచింది. ఎదురుగా ఉన్న కరుణ చెంపపై బలంగా కొట్టింది. ఇక ఇదే షోలో ‘జబర్దస్త్’ పవిత్ర జుత్తుని కూడా ఎవరో కత్తిరించారు. ఇలా సమ్ థింగ్ ఇంట్రెస్ట్ అనిపిస్తున్న ప్రోమో వైరల్ గా మారింది. మరి షోలో ఇలాంటి వాటిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో చెప్పండి.