ప్రముఖ ఛానల్ ఈనాడులో ప్రసారమౌతున్నకామెడీ షో జబర్థస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు బుల్లి తెరకు పరిచయమయ్యారు. పరిచయం చేయడమే కాకుండా ఈ షో ఎంతో మందికి కొత్త జీవితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. చిన్న చిన్న క్యారెక్టర్లుగా ఈ షోలోకి వచ్చిన వారూ.. తర్వాత టీమ్ లీడర్లుగా ఎదిగారు. అలాంటి వారిలో ఒకరు రాకింగ్ రాకేష్. అయితే రాకేష్ , ప్రముఖ న్యూస్ యాంకర్ సుజాతతో కొన్ని నెలల నుండి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, వీరికి శుక్రవారం నిశ్చితార్థం జరిగింది.
సంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి, జబర్థస్త్ షో మాజీ జడ్జి రోజా, యాంకర్ అనసూయ, గెటప్ శ్రీను దంపతులు, జబర్థస్త్ షో సంబంధించిన నటీనటులు హాజరయి.. తమ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం వీటికి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. రాకేష్ జబర్తస్త్ తో పాటు పలు టివి షోల్లో పాల్గొంటున్నారు. అప్పుడుప్పుడు వెండి తెరపైనా మెరుస్తున్నారు. సుజాత జబర్థస్త్ లో రాకేష్ టీంలో చేస్తున్నారు.