జానియర్ సమంతగా బుల్లితెర మీద పాపులర్ అయిన అషు రెడ్డి.. కొంతకాలంగా షోస్ కి దూరంగా ఉంటుంది. ఆ మధ్య కామెడీ స్టార్స్, బీబీ జోడీ షోస్ లో కనిపించిన అషు రెడ్డి.. మధ్యలో అనారోగ్యం కారణంగా గ్యాప్ ఇచ్చింది. మొన్నటి వరకూ విదేశాల్లో సేద తీరిన అషు రెడ్డి.. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చింది. వైజాగ్ లో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరైంది. కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మెహబూబ్ చేస్తున్న బీబీ జోడీ డ్యాన్స్ షోలో అషు రెడ్డి కనిపించకపోవడంపై నెటిజన్స్ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. మెహబూబ్ కి అన్యాయం చేసావంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విదేశాల్లో ఉన్నప్పుడు కూడా.. ఆమె పెట్టే ఫోటోస్ కి కింద కామెంట్స్ లో.. ‘అనారోగ్యం అని చెప్పి మెహబూబ్ కి హ్యాండ్ ఇచ్చావ్.. అక్కడ నువ్వు చేసే పని ఇదా’ అంటూ విమర్శలు చేశారు నెటిజన్స్. తాజాగా ఈ కామెంట్స్ ఎక్కువవడంతో ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బిగ్ బాస్ షోలో మెహబూబ్ కి జోడీగా ఉన్న అషు రెడ్డి.. అనారోగ్యం కారణంగా షోకి దూరంగా ఉంది. ఇదే విషయంపై అషు రెడ్డిని మెహబూబ్ అడగ్గా.. తన ఆరోగ్యం బాలేదంటూ వాయిస్ మెసేజ్ పెట్టింది. దీంతో మెహబూబ్ ఒంటరిగానే డాన్స్ చేయాల్సి వచ్చింది. అయితే నెటిజన్స్ ఎక్కువ సీన్ చేస్తుండడంపై ఆమె స్పందించింది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన అషు రెడ్డి.. కామెడీ స్టార్స్ ప్రోగ్రాంకి వెళ్ళింది.. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళింది.
మరి మెహబూబ్ షోకి వెళ్లలేదని ప్రశ్నించడంతో ఆమె మండిపడింది. తనకు అనారోగ్య సమస్య ఉందని.. పూర్తిగా రికవరీ అవ్వడానికి నెల రోజులు పడుతుందని వెల్లడించింది. నిజాలు తెలియకుండా తనపై కామెడీ చేస్తే తనకు ఇష్టం ఉండదని, దయచేసి ఈ విషయంపై మాట్లాడకండి అంటూ సీరియస్ అయ్యింది. కొంతమంది పాక్షికంగా ఆలోచించి తనపై కామెంట్స్ చేస్తున్నారని.. ఏం జరుగుతుందో.. ప్రతీదీ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరికి ఉండే కష్టాలు వాళ్లకి ఉంటాయని.. కాబట్టి తన విషయంలో కామెడీ చేయవద్దంటూ నెటిజన్స్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అదండీ విషయం.. డ్యాన్స్ షోలో చేస్తే ప్రాక్టీస్ చేయాలి, డాన్స్ చేయాలి.. అదే నటిస్తే సమస్య ఉండదు కదా అనేది అషు రెడ్డి వెర్షన్. మరి అషు రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.