యాంకర్ రవి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యాంకర్ గా చిన్న చిన్న షోస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన రవి.. ఈరోజు టాప్ షోస్ లో హోస్ట్ గా చేస్తున్నారు. రవి చేయని ఎంటర్టైన్మెంట్ ఛానల్ లేదు. దాదాపు అన్ని ఛానల్స్ లోనూ పలు షోస్, కార్యక్రమాలు చేశారు. బిగ్ బాస్ సీజన్ 5లో కూడా కంటిస్టెంట్ గా చేసి అందరినీ అలరించారు. తనదైన కామెడీ టైమింగ్ తో, పంచులతో షోని టాప్ లో నిలబెట్టడంలో యాంకర్ రవిది ఒక ప్రత్యేకమైన శైలి. యాంకర్ గానే కాకుండా నటుడిగా, హీరోగా పలు షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో కూడా నటించారు. రవికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఫేస్ కట్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ లా ఉండడంతో జూనియర్ రణబీర్ కపూర్ అని లేడీ ఫ్యాన్స్ పిలుచుకుంటారు. ప్రస్తుతం యాంకర్ రవి చేతి నిండా టీవీ షోలు, ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఒక పక్క షోలు, ఈవెంట్స్ చేస్తూనే.. మరో పక్క యాంకర్ రవి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తున్నారు. డైలీ కొత్త కొత్త వీడియోలు అప్ లోడ్ చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటారు. తాజాగా రవి బర్త్ డే సందర్భంగా ఒక పార్టీ వీడియోని తన ఛానల్ లో అప్ లోడ్ చేశారు. తనతో పాటు ఫస్ట్ నుండి ఉన్న ఫ్రెండ్స్ ని, బిగ్ బాస్ సీజన్ 5తో పరిచయమైన ఫ్రెండ్స్ ని అందరినీ తన బర్త్ డే పార్టీకి ఆహ్వానించారు. ఈ బర్త్ డే ఫంక్షన్ కి వరుణ్ సందేశ్, తనీష్, యాంకర్ ప్రదీప్, అషు రెడ్డి, అరియానా, లహరి, సన్నీ, మెహబూబ, వర్షిణి, ప్రియాంక సింగ్ ఇలా చాలా మంది వచ్చారు. వీళ్ళందరికీ రవి పూల్ పార్టీ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ లో ఆటలాడుతూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర్ల అవుతోంది. యాంకర్ రవి తన ఫ్రెండ్స్ కి పూల్ పార్టీ ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.