తెలుగు సహా అన్ని దక్షిణాది సినిమాల్లో నటించిన జాతీయ నటి ప్రియమణి అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. తెలుగులో 2003లో వచ్చిన ‘ఎవరే అతగాడు’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియమణి.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించారు. తమిళంలో కార్తీ హీరోగా వచ్చిన నటించిన ‘పరుత్తివీరన్’ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నితిన్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించారు. ప్రియమణి వచ్చి ఇన్నేళ్లయినా స్టిల్ ఆమె ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నారు. బాలీవుడ్ సినిమాలలోనే కాకుండా, ది ఫ్యామిలీ మేన్, హిజ్ స్టోరీ వంటి హిందీ వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.
తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లో బుల్లితెర షోస్ కి హోస్ట్ గా, జడ్జ్ గా చేసిన ప్రియమణి.. తెలుగులో ఢీ ఛాంపియన్స్, ఢీ సీజన్స్ 10, 11, 13 డ్యాన్స్ షోస్ కి హోస్ట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఢీ సీజన్ 14 డ్యాన్సింగ్ ఐకాన్ షోకి జడ్జిగా ఉన్నారు. అయితే ఇంత క్రేజ్, హోదా ఉన్న ప్రియమణికి సైతం ఇబ్బందులు తప్పలేదట. హీరోయిన్ గా చేసిన తొలినాళ్లలో ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. ఓ సినిమా షూటింగ్ మొదలై సగం షూటింగ్ అయిన తర్వాత.. ఓ సీన్ కోసం ప్రియమణి బొడ్డు దగ్గర టాటూ వేయించుకోవాలని నిర్మాత ఇబ్బంది పెట్టాడట. అప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
తన వల్ల సినిమా డిస్టర్బ్ అవ్వడం ఎందుకని, చేసేదేమీ లేక ఇష్టం లేకపోయినా నిర్మాత కండిషన్ కి ఒప్పుకుని బొడ్డు మీద టాటూ వేయించుకుందట. సినిమా వాళ్లకేంటి ఇలా వస్తారు, షూటింగ్ లో పాల్గొంటారు, అలా డబ్బులు పట్టుకెళ్ళిపోతారు అని అనుకుంటే పొరపాటే. ఎవరి కష్టం వాళ్ళది. ప్రతీ ఒక్కరూ కూడా అన్నీ నచ్చే చేయరు. కొన్ని నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది. ప్రియమణి కూడా ఇలానే నచ్చకపోయినా బలవంతంగా చేయాల్సి వచ్చిందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.