సినీ పరిశ్రమలో అనేక వివాదాలు జరిగి పోలీస్ కేసులు అవుతుంటాయి. ఈక్రమంలో కోర్టు కూడా సినీ హీరోలను, నిర్మాతలను దోషులుగా తేల్చిన సందర్బాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాతకు జైలు శిక్షపడింది. అమెరికాలోని చికాగో కేంద్రంగా టాలీవుడ్ నిర్మాత మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులు వ్యభిచారం నిర్వహిస్తున్న బాగోతం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కిషన్, ఆయన భార్య చంద్రకళను పోలీసులు అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ దందాలో పలువురు తెలుగు, కన్నడ హీరోయిన్ల ప్రమేయం ఉందని, కొందరు డబ్బు కోసం, మరికొందరు బలవంతంగా ఇందులోకి దిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతకాలం చికాగో జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. తాజాగా కిషన్, చంద్రకళ దంపతులను కోర్టు దోషులుగా తెల్చింది. వివరాల్లోకి వెళ్తే..
అమెరికలో నివాసం ఉంటున్న కిషన్, చంద్రకళ దంపతులు అమెరికాలో తెలుగు ఈవెంట్ల నిర్వహించే వారు. అమెరికాలోని తెలుగు సంఘాలకు ఈ వెంట్ల కోసం సినీ సెలబ్రిటీలను రప్పించే కోఆర్టినేటర్ ముసుగులో హీరోయిన్లను వ్యభిచార ఊబిలోకి లాగేవారు. కిషన్ మోదుగుమూడి విటులతో మాట్లాడుతున్న ఆడియో టేపులు కూడా ఆ మధ్య బయటకు వచ్చాయి. నటీమణులు అమెరికా చేరుకోగానే వారి పాస్ పోర్టులను లాగేసుకునే వారని, బలవంతంగా వారితో వ్యభిచారం చేయించేవాడని, ఒప్పుకోకపోతే ఓ రకమైన బెదిరింపులకు పాల్పడేవాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికా రప్పించి.. అక్కడ వారితో వ్యభిచారం చేయించారన్న కేసుపై కిషన్, చంద్రకళను అప్పట్లో చికాగో పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత కాబోయే భార్యతో సరదాగా గడుపుతున్న RP.. ఫొటోస్ వైరల్!
ఇంతకాలం విచారణ జరిపిన కోర్టు… వారిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చింది. అనైతిక కార్యక్రమాల కోసం విదేశీ మహిళలను అక్రమంగా రవాణా చేసినట్టు తేలింది. వీసా పర్మిట్లను దురిన్వియోగం చేశారన్న ఫెడరల్ ఏజెన్సీ చేసిన ఆరోపణలతో నార్త్ ఎలినాయ్ కోర్టు ఏకీభవించింది. నిందితుడికి 27-34 ఏళ్ల మధ్య శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేశారు. నిందితులిద్దరికీ జూన్ 24న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.