సాధారణంగా సినీ ఇండస్ట్రీ లో పారితోషకం అనగానే.. ముందు హీరో కి ఎంత..? హీరోయిన్లకు ఎంత అన్న అంశమే చర్చనీయాంశం గా ఉంటుంది. అయితే కొన్ని పవర్ ఫుల్ గా ఉండే పాత్రలకు, స్టార్ కామెడియన్లకు కూడా గట్టిగానే రెమ్యునరేషన్ ఉంటుంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన రాజబాబు, రేలంగి లాంటి వారికి హీరో స్థాయిలో పారితోషికం తీసుకునేవారని టాలీవుడ్ టాక్. కొందరు టాప్ కమెడియన్స్ అయితే.. రోజుకు ఇంత అన్న లెక్కన ఎన్ని రోజులు షూటింగ్ లో ఉండాల్సి వస్తే.. అంత మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. మన టాలీవుడ్ లో కూడా కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
బ్రహ్మానందం రెమ్యూనరేషన్ :
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు మనకు నవ్వొచ్చేస్తుంది. డైలాగులు లేకుండా కేవలం హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అంతలా కామెడీ పండించగల టాలెంట్ ఆయనది. ప్రస్తుతం ఆయన చాలా వరకు సెలక్టెడ్ మూవీస్ లో నటిస్తున్నారు. రోజుకు దాదాపు 3 లక్షలు పైగా తీసుకుంటున్నారు.
అలీ రెమ్యూనరేషన్ :
తెలుగు ఇండస్ట్రీలోకి ‘సీతాకోక చిలక’చిత్రంతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత స్టార్ కమెడియన్ గా ఎదిగారు అలీ. కమెడియన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు. గత కొంత కాలంగా ఆయన బుల్లితెరపై ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన సినిమాలు చేసుకుంటూ.. మధ్యలో స్మాల్ స్క్రీన్ వైపు వెళ్తున్నాడు. ఈయన రోజుకు సుమారు 3.5 లక్షలు తీసుకుంటున్నాడు.
వెన్నెల కిషోర్ రెమ్యూనరేషన్ :
బ్రహ్మానందం, ఆలీ తర్వాత ఆ స్థాయిలో తనదైన కామెడీతో అలరిస్తున్న నటుడు వెన్నెల కిషోర్. ఏడాదికి ఆయన పాతిక సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా చలామని అవుతున్నాడు. తనదైన మేనరీజంతో థియేటర్ లో నవ్వుల వెన్నెల కురిపించి అందరికి దగ్గరయ్యారు. ఆయన ఒక్కో సినిమాకు మూడు లక్షల వరకు తీసుకుంటారు.
సునీల్ రెమ్యూనరేషన్ :
తనదైన కామెడీ టైమింగ్ తో మేనరీజంతో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు సునీల్. తరువాత హీరో గా కొన్ని సినిమాల్లో అలరించారు. కానీ హీరోగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. దాంతో ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా కొనసాగుతున్నారు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు. సునీల్ ప్రస్తుతం రోజుకు నాలుగు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారట.
పోసాని మురళి రెమ్యూనరేషన్ :
వెండితెరపైనే కాదు ఎక్కడైనా సరే రాజా.. లవ్ యు రాజా.. అంటూ తనదైన కామెడీ డైలాగ్ తో అలరిస్తున్నారు పోసాని కృష్ణమురళి. దర్శకుడిగా, రచయితగా ఇండస్ట్రీకి వచ్చిన పోసాని.. బిజీ నటుడిగా మారిపోయారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటిస్తున్నారు. పోసాని పారితోషికం రోజుకు రెండున్నర లక్షల వరకు తీసుకుంటారట.
30 ఇయర్స్ పృథ్వీ రెమ్యూనరేషన్ :
తెలుగు ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు ఫృథ్వి. పేరడీ డైలాగ్స్ తో తనదైన కామెడీ పండిస్తారు ఫృథ్వి. ఒకప్పుడు రోజుకు సుమారు 2 లక్షలు తీసుకున్న ఈయన.. ప్రస్తుతం ఆయన 75 వేల నుంచి లక్ష వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ప్రియదర్శి రెమ్యూనరేషన్ :
‘పెళ్లి చూపులు’ సినిమా లో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి తనదైన కామెడీ స్టైల్ తో ఆకట్టుకున్న ప్రియదర్శి. కేవలం కమెడియన్‌గానే కాకుండా నటుడిగా ఈయన చాలా బిజీ అవుతున్నాడు. వెబ్ సిరీస్‌లు చేసుకుంటూనే.. సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తున్నాడు. ప్రియదర్శి కూడా రోజుకు రెండు లక్షల పారితోషికాన్ని తీసుకుంటారట.
శ్రీనివాస రెడ్డి రెమ్యూనరేషన్ :
రవితేజ నటించిన ఇడియట్ సినిమాతో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు శ్రీనివాస్ రెడ్డి. ఆ తర్వాత వరుస చిత్రాలతో కమెడియన్ గా మెప్పించాడు. రెండు మూడు చిత్రాల్లో హీరోగా నటించాడు. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే శ్రీనివాస రెడ్డి చాలా సినిమాల్లోనే నటించారు. ప్రస్తుతం, శ్రీనివాస రెడ్డి రోజుకు రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారట.
రాహుల్ రామకృష్ణ రెమ్యూనరేషన్ :
అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించిన రాహూల్ రామకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ మద్య వస్తున్న కమెడియన్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ. రాహుల్ రోజుకు రెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటారట.
సప్తగిరి రెమ్యూనరేషన్ :
పరుగు సినిమాలో కొంత సీరియస్ క్యారెక్టర్ లో కనిపించినా.. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ ప్రేమ కథాచిత్రమ్’ మూవీలో తనదైన కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు సప్తగిరి. మగజాతి ఆణిముత్యం అంటూ తనదైన కామెడీ పండిస్తున్నాడు. ఆ మద్య హీరోగా కూడా ట్రై చేశాడు. సప్తగిరి కూడా రోజుకు రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటారట.